Virupaksha: విరూపాక్ష బుకింగ్స్ అలా ఉన్నాయా.. ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?

మరో రెండు రోజుల్లో సాయితేజ్, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటించిన విరూపాక్ష మూవీ థియేటర్లలో రిలీజవుతోంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది. రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఏసియన్ స్వప్న, ఏఎంబీ సినిమాస్ లో మాత్రమే బుకింగ్స్ బాగున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. మరోవైపు తెలుగులో సంయుక్త మీనన్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా (Virupaksha) కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంయుక్త మీనన్ సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కార్తీక్ దండు దర్శకుడిగా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ మూవీ సక్సెస్ సాధిస్తే సాయితేజ్ మార్కెట్ పెరగడంతో పాటు సాయితేజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి. సాయితేజ్ కు సక్సెస్ దక్కాలని ఇతర హీరోల అభిమానులు సైతం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. సాయితేజ్ వినోదాయ సిత్తం రీమేక్ లో నటిస్తుండగా ఈ సినిమా జులై నెల 28వ తేదీన రిలీజ్ కానుంది.

సాయితేజ్ పవన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వినోదాయ సిత్తం రీమేక్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. కొన్ని నెలల గ్యాప్ లోనే సాయితేజ్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. సాయితేజ్ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియాపై కూడా సాయితేజ్ దృష్టి పెట్టాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus