మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకునేవాడు. కానీ 2021 లో అతనికి బైక్ యాక్సిడెంట్ అవ్వడం.. భయంకరమైన గాయాలు కావడంతో.. కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ క్రమంలో అతను హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ మంచి కథతో సాయి ధరమ్ తేజ్ సినిమా చేశాడు అనే మంచి పేరొచ్చింది.
ఆ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి మరో సినిమా రాలేదు. కొంచెం గ్యాప్ తర్వాత అతను హీరోగా రూపొందిన చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘ఎస్వీసిసి’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ తనయుడు బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 21న ఈ మూవీ విడుదల కాబోతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా ఈ చిత్రం పూర్తి చేసుకోవడం జరిగింది.
ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఈ చిత్రం చూస్తే భయపడే అవకాశం ఉందని వారు అంటున్నారు. చిన్నపిల్లలు అయితే పెద్ద వాళ్ళ సపోర్ట్ తో చూస్తారు. కానీ వయసు మీద పడిన వాళ్ళకి అయితే గుండెదడ వంటివి వచ్చే ప్రమాదం ఉందని సెన్సార్ వారు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు ‘ఎ’ రేటింగ్ వస్తుండటం అంటే కొంత షాకిచ్చే అంశం అనే చెప్పాలి. కానీ ‘విరూపాక్ష’ పై టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఏమాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. రంజాన్ హాలిడే అడ్వాంటేజ్ తో సాయి ధరమ్ తేజ్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!