Virupaksha: ‘విరూపాక్ష’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ మూవీకి కార్తీక్ దండు దర్శకుడు. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ , ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందించడం విశేషంగా చెప్పుకోవాలి. పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఈ చిత్రం (Virupaksha) టీజర్, ట్రైలర్ లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘నచ్చావులే’ అనే పాటలో హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి.ఆ పాటలో సంయుక్త మీనన్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్లో కూడా ఆమె రొమాంటిక్ సన్నివేశాలు చూపించి ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేపారు. ‘విరూపాక్ష’ ప్రివ్యూ షో ని నిన్న అంటే బుధవారం నాడు ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖుల మధ్య వేయడం జరిగింది.

కొంతమంది బయ్యర్స్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించడం జరిగింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా ప్రారంభం నుండి చాలా ఎంగేజింగ్ గా ఉందని, భయపెట్టే అంశాలు ఎక్కువగానే ఉన్నాయని .. ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. అటు తర్వాత సెకండ్ హాఫ్ లో సంయుక్త నటన హైలెట్ అయ్యిందని అంటున్నారు.

సాయి ధరమ్ తేజ్ బాగా నటించాడని, అజయ్ పాత్ర కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ‘కాంతార’ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ అందించిన నేపధ్య సంగీతం, శ్యామ్ దత్త్ సినిమాటోగ్రఫీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని అంతా చెబుతున్నారు. థ్రిల్లింగ్, హర్రర్, మిస్టరీ ని దట్టించి దర్శకుడు కార్తీక్ దండు గ్రిప్పింగ్ గా ఈ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని వారు అంటున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus