Virupaksha Collections: ‘విరూపాక్ష’ .. ఫస్ట్ వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుంది..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అజయ్, యాంకర్ శ్యామల, సునీల్, రాజీవ్ కనకాల, సాయి చంద్, అభినవ్ గోమఠం వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.

ఇక ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు సూపర్ గా కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజు, మూడో రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 7.17 cr
సీడెడ్ 2.30 cr
ఉత్తరాంధ్ర 2.04 cr
ఈస్ట్ 1.11 cr
వెస్ట్ 0.85 cr
గుంటూరు 1.17 cr
కృష్ణా 1.08 cr
నెల్లూరు 0.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 16.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.38 cr
ఓవర్సీస్ 3.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 20.69 cr (షేర్

‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రానికి రూ.22.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.22.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.20.69 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం రోజు కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది. మొదటి సోమవారం రోజున ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus