Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

కమర్షియల్‌ సినిమాలు మాత్రమే చేస్తుంటాడు.. దాని వల్ల కెరీర్‌ రిస్క్‌ చాలా తక్కువ.. అందుకే కెరీర్‌ ఇన్నేళ్లుగా సాగిపోతూనే ఉంది – విశాల్‌ గురించి ఇన్నేళ్లుగా చాలామంది చేసే విమర్శలు ఇవే. ఆ మాటలు నిజం కావు అని ఆయన చాలాసార్లు నిరూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు ఆ ప్రయత్నంలో మంచి ఫలితం కూడా అందుకున్నాడు. కానీ ఇప్పటికీ తన మీద ఆ ముద్ర వేస్తూనే ఉన్నారు. ఆయన కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలాంటి తాజా ప్రయత్నమే ‘మకుటం’. తమిళంలో ఈ సినిమా పేరు ‘మగడం’.

Vishal

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా ఈ పాటికే విడుదలై ఉండాల్సింది. ఎందుకంటే సినిమాఉ సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తామని చెప్పారు. కానీ పనులు పూర్తవ్వని కారణం సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విశాల్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటి ప్రకారం సినిమా ఎంత వైవిధ్యంగా తెరకెక్కుతోంది అనేది అర్థమవుతోంది. ‘మగుడం’ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి అని చెప్పిన విశాల్‌.. ఈ సినిమాలోని మూడు పాత్రల గురించి వివరించారు.

సినిమాలో చేస్తున్న మూడు పాత్రలకు మూడు డిఫరెంట్‌ లుక్స్‌, బాడీ లాంగ్వేజ్‌లు ఉంటాయి. వాటిని చాలా ఇష్టంగా చేశాను. ఆ మూడు పాత్రల్లో ఒకటి మెడికల్‌ రిప్రజింటేటివ్‌, మరొకటి గ్యాంగ్‌స్టర్‌, మూడోది హార్డ్‌కోర్‌ ఇళయరాజా ఫ్యాన్‌. మూడుకు మూడు అదిరిపోతాయి అని చెప్పాడు విశాల్‌. అన్నట్లు ఈ సినిమాకు దర్శకుడు కూడా విశాలే. తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నాడు విశాల్‌. అందులో ఒకటి ‘పురుషన్‌’. ఈ సినిమాకు సుందర్‌.సి దర్శకుడు. ఇక రెండో సినిమా ‘తుప్పరివాలన్‌ 2’. అంటే ‘డిటెక్టివ్‌ 2’. ఈ సినిమాకు దర్శకుడు విశాల్‌. నిజానికి ఆయన డైరక్టోరియల్‌ డెబ్యూ ఈ సినిమానే అవ్వాలి. ‘మగుడం’ సినిమా నుండి రవి అరసు తప్పుకోవడంతో దాన్ని కూడా విశాల్‌ భుజానికెత్తుకున్నాడు..

స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus