Vishal: రాజకీయాలపై విశాల్‌ కామెంట్స్.. ఎందుకొస్తున్నాడో చెప్పేశాడు!

వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ప్రముఖ నటుడు విశాల్‌.. రాజకీయాల్లోకి అదే వేగంగా వస్తున్నాడు అంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రతిసారి ఎన్నికల సీజన్‌కు ముందు ఇలా వార్తలు రావడం, వాటిని విశాల్‌ కొట్టిపారేయడం జరుగుతూనే ఉంది. అయితే పుకార్ల షికార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. విశాల్‌ రాజకీయాల్లోకి రావడం పక్కా అని పుకార్లొచ్చాయి. అంతేకాదు ఈసారి ఎక్కడ పోటీ చేస్తారు అనే విషయమూ చెప్పేస్తున్నారు. దీనిపై మరోసారి విశాల్‌ క్లారిటీ ఇచ్చాడు.

తెలుగు నాట పుట్టినా తమిళంలో స్టార్‌ హీరో అయ్యాడు విశాల్‌. అక్కడ నటీనటుల సంఘం ఎన్నికల్లోనూ అదరగొడుతున్నారు. అలాంటి విశాల్‌ రానున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ వదంతులేనని విశాల్‌ మరోసారి కొట్టిపారేశాడు. ‘లత్తి’ (లాఠీ) సినిమాకు సంబంధించి ఇటీవల చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో విశాల్‌ మాట్లాడాడు. ఈ క్రమంలో పాలిటిక్స్‌తో తన ఆలోచనలు చెప్పాడు.

నేను రాజకీయాల్లోకి రావడం అయితే తథ్యం. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తాను. అయితే 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో పోటీకి దిగుతాను అనే విషయంలో నిజం లేదు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై పోటీకి దిగుతానని వస్తున్న వార్తలు సత్యదూరం. అయతే కుప్పం, ఆ ప్రాంత ప్రజలతో నాకు మంచి అనుబంధం ఉంది. అక్కడ మా నాన్న గ్రానైట్‌ వ్యాపారం చేసేవారు. మూడేళ్లపాటు అక్కడే ఉన్నాను అని చెప్పాడు విశాల్‌.

దీంతో విశాల్‌ రాజకీయాల్లోకి వస్తారు కానీ వచ్చే ఎన్నికల్లో కాదు అనే విషయంలో క్లారిటీ వచ్చింది. అలాగే చంద్రబాబుపై పోటీ అనే విషయంలోనూ స్పష్టత వచ్చింది. కానీ కుప్పం గురించి, అక్కడి వాళ్లతో తన అనుబంధం గురించి అంతగా చెప్పడం వెనుకే ఏదో తేడా కొడుతోంది అంటున్నారు నెటిజన్లు. ఈసారి కాకపోయినా, తర్వాత అయినా సరే విశాల్‌ పోటీ కుప్పం నుండే అని ఫిక్స్‌ అవ్వొచ్చు అని చెబుతున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus