కోలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన విశాల్ కు తెలుగు ప్రేక్షకుల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమా గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. అయితే విశాల్ తాజాగా ముంబై సెన్సార్ బోర్డ్ గురించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు కేంద్రం దృష్టికి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సెన్సార్ బోర్డ్ కార్యాలయంలో అవినీతి జరిగిందని వార్తలు రావడం దురదృష్టకరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
అవినీతిని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వాళ్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక సీనియర్ ఆఫీసర్ ఈ విషయం గురించి విచారణ జరుపుతారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మినిష్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ రాగా విశాల్ కు న్యాయం జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.
గతంలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. విశాల్ నోరు మెదపడంతో సినిమాల విషయంలో జరుగుతున్న అన్యాయం వెలుగులోకి వచ్చింది. విశాల్ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలు రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది. తెలుగులో విశాల్ మార్కెట్ అంతకంతకూ తగ్గుతోంది.
విశాల్ (Vishal) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశాల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముంబై సెన్సార్ బోర్డ్ విశాల్ నుంచి తీసుకున్న డబ్బులను కేంద్ర ప్రభుత్వం వెనక్కు ఇప్పించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !