కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడు విశాల్. స్వతహాగా తెలుగువాడు అవ్వడం.. అందులోనూ నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గా ఎదగడంతో ఇతని క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.ఈ మధ్యకాలంలో ఇతని పై అనేక ఆరోపణలు కూడా వ్యక్తమవుతుండడంతో.. నిత్యం ఏదో ఒక వార్తలో ఉంటూ వస్తున్నాడు విశాల్. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇటీవల ఇతని ఫ్యామిలీ కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ వీళ్ళు త్వరగానే కోలుకున్నారు.ఇక విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత అయిన జి.కె.రెడ్డి అయితే వర్కౌట్లు చేస్తూ వీడియోలను కూడా విడుదల చేస్తున్నాడు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఎస్.పి.పరశురామ్’ చిత్రానికి ఇతనే నిర్మాత. ఈయన వయసు 82 ఏళ్ళు అయినప్పటికీ ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నారు. ఇతని ఫిట్నెస్ కు కారణం ఏంటి? అని సందేహ పడేవారికి కొన్ని వర్కౌట్లు చేస్తూ.. జవాబిచ్చాడు.
‘కరోనా భయంకరంగా విజృంభిస్తున్న తరుణంలో బయటికి ఎక్కువగా వెళ్ళడం మంచిది కాదు.కానీ ఇంట్లో ఉండి కూడా ఫిట్ నెస్ ను కాపాడుకోవచ్చు. అతి తేలికైన ఈ వ్యాయామాలే ఆరోగ్యంగా ఉంచుతాయి, వీటిని రోజూ చేస్తే ఏ వయసులో అయినా ఫిట్ గా ఉండొచ్చు’ అంటూ ఆ వ్యాయామాలను చేసి చూపించారు జి.కె.రెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!