Vishal: అప్పుడు సాయం చేశాం… ఇన్నేళ్లయినా ఏం మార్పులేదు: విశాల్‌

  • December 5, 2023 / 12:59 PM IST

సినిమాల్లో హీరో అయిన విశాల్‌… నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రజలకు సమస్యలు వస్తే సాయానికి ముందుకొచ్చే హీరోల్లో విశాల్‌ ఒకరు. గతంలో తమిళనాడులో తుపాను వచ్చినప్పుడు, మొన్నీమధ్య కరోనా – లాక్‌డౌన్‌ వచ్చినప్పుడు ఆయన ముందుకొచ్చి సాయం చేశారు. ఎంతోమందికి పిలుపునిచ్చారు కూడా. అలాంటి విశాల్‌ ఇప్పుడు చెన్నై కార్పొరేషన్‌ మీద విరుచుకుపడ్డారు. మిగ్‌జాం తుపానుతో చెన్నైలోని రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి.

బస్టాండ్‌లు, ఎయిపోర్టులు, రైల్వే స్టేషన్లు నీటితో నిండిపోయాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ పరిస్థితిపై విశాల్‌ స్పందించాడు. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (GCC) విఫలమైంది అంటూ విశాల్‌ ఆరోపించాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో విశాల్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆ లెక్కన ప్రభుత్వంపై తన ఆగ్రహం వ్యక్తం చేసినట్లే అని నెటిజన్లు అంటున్నారు. ఆ వీడియోలో చెన్నై మేయర్‌ ప్రియా రాజన్‌ను ఉద్దేశించి చెన్నైలోని పరిస్థితిని వివరిస్తూ మాట్లాడారు.

‘‘డియర్‌ ప్రియా రాజన్‌, జీసీసీ కమిషనర్‌, సంబంధిత అధికారులు… మీరంతా మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వరదల సమయంలో రోడ్లపై పారే డ్రైనేజీ నీరు మీ ఇళ్లలోకి రాదనుకుంటున్నా. మీ ఇళ్లకు నిరంతర విద్యుత్తు, ఆహారం సరఫరా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను. అయితే ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా ఆ పరిస్థితిలో లేం’’ అని (Vishal)  చెప్పుకొచ్చారు.

‘‘చెన్నైలో ఏర్పాటు చేసిన వరద నీటి కాలువ ప్రాజెక్ట్ సింగపూర్ కోసమా? లేక చెన్నై కోసమా? 2015లో చెన్నైకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు మేం కూడా సాయం చేశాం. కానీ ఇప్పుడు అంటే ఎనిమిదేళ్ల తర్వాత అంతకుమించిన దయనీయమైన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో మేం కూడా బయటికొస్తాం. ఆహార సామగ్రి, తాగు నీరు అందిస్తాం. ఈ సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు బయటకు వచ్చి అవసరమైన సాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని మాట్లాడారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus