తమిళ సీనియర్ హీరో,డి.ఎం.డి.కె పార్టీ అధినేత అయిన విజయ్ కాంత్ ఈరోజు మరణించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన.. ఇటీవల కరోనా బారిన పడటంతో శ్వాస సంబంధిత సమస్య తలెత్తడం వల్ల మరణించారు. దీంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయ్ కాంత్ ని అభిమానించే వారు మాత్రమే కాకుండా కోలీవుడ్ నటీనటులు విజయ్ కాంత్ మృతికి చింతిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే విజయ్ కాంత్ మృతితో హీరో విశాల్ (Vishal) కృంగిపోతూ చేసిన ఓ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అతను షూటింగ్ కారణంగా న్యూయార్క్ వెళ్లడం జరిగింది. దీంతో ‘విజయ్ కాంత్ ను చివరి సారిగా చూసుకునే అవకాశం లేదని’ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. విశాల్ ఆ వీడియో క్లిప్ లో మాట్లాడుతూ.. “విజయ్ కాంత్ గారి మరణ వార్త నాకు ఇప్పుడే తెలిసింది. అది విన్నప్పటి నుండి నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి.
మా ‘కెప్టెన్’ ని కోల్పోవడం నన్ను ఎంతో బాధకు గురిచేస్తుంది. అన్నా నన్ను క్షమించు. కడసారి నిన్ను చూసుకోలేకపోతున్నాను. నేను నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. నా వెంటే ఉండి ఎంతో ప్రోత్సహించారు. ఇలాంటి రోజు వస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. నీ కడసారి చూపుకు నోచుకోలేని దౌర్భాగ్యుడిని నేను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!