కొన్ని కాంబినేషన్లు అనౌన్స్‌మెంట్‌తో ట్రెండింగ్‌లోకి వస్తాయి. మరికొన్ని కాంబినేషన్‌లు పుకార్లతోనే ట్రెండింగ్‌లోకి వచ్చేస్తాయి. ఈ రెండో రకం కాంబినేషన్ కచ్చితంగా మాస్ కమ్ యాక్షన్ కాంబినేషనే అయి ఉంటుంది. అలాంటి ఓ కాంబో గురించి తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. వాళ్లే విశాల్ (Vishal) – గౌతమ్ మీనన్ (Gautham Menon) . 12 ఏళ్ల క్రితం నాటి సినిమా ‘మద గజ రాజా’ సినిమాతో హిట్ కొట్టిన విశాల్ కొత్త సినిమా గౌతమ్ మీనన్‌తోనే అనేది లేటెస్ట్ టాక్.
Vishal
తమిళంలో మాస్ – యాక్షన సినిమాలతో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. అయితే రీసెంట్ టైమ్స్‌లో ఆయన చేస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు. ఆయన లేటెస్ట్ సినిమా ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram) విడుదలకు నానా ఇబ్బందులు పడుతూ వస్తోంది. అదిగో, ఇదిగో అంటూ కొన్ని డేట్స్ బయటకు వస్తున్నా ఇంకా సినిమా అయితే రావడం లేదు. ఎప్పుడొస్తుంది అనేది కూడా తెలియడం లేదు.
ఈ సమయంలో మమ్ముట్టితో (Mammootty) ‘డొమినిక్’ అనే మలయాళ సినిమా చేసి దానిని విడుదలకు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రీసెంట్ టైమ్స్‌లో మీడియాతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీంతో ఈ సినిమా తర్వాత ఏంటి అనే ప్రశ్న ఆయన దగ్గరకు వస్తోంది. మరోవైపు విశాల్‌దీ అదే పరిస్థితి. ఈ క్రమంలో ఇద్దరూ కలసి పని చేస్తామని విశాల్ ప్రకటించాడు. ఓ మాస్ యాక్షన్ జోనర్‌లో ఈ సినిమా ఉంటుందట.
నిజానికి విశాల్ ఇప్పుడు ‘డిటెక్టివ 2’ సినిమాను స్వీయ దర్శకత్వంలో చేయాలి అనుకున్నారు. ఈ మేరకు పనులు మొదలుపెట్టారు కూడా. కానీ రీసెంట్ అనారోగ్యం, ఇతర కారణాల వల్ల ఆయన ఆ సినిమాను కొన్ని రోజులు హోల్డ్‌లో పెట్టాలని ఫిక్స్ అయ్యారట. అందుకే గౌతమ్ మీనన్‌తో సినిమా చేస్తానని ప్రకటించారు అని కోడంబాక్కం వర్గాల సమాచారం. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుంది అని చెబుతున్నారు.