Saamanyudu Trailer: పవర్ ప్యాక్డ్ అండ్ ఎమోషనల్.. ఆకట్టుకుంటున్న ‘సామాన్యుడు’ ట్రైలర్..!

యాక్షన్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’ విడుదలకు ముస్తాబవుతోంది. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది దీని క్యాప్షన్.నూతన దర్శకుడు తు.పా.శరవణన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విశాల్ తన సొంత బ్యానర్ అయిన ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ (VFF) పై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ట్రైలర్ ను బట్టి విశాల్‌ ఓ కామన్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు.ఎప్పటిలానే అతను ఫిట్ గా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఇది క్రైమ్ కథనే అనే సంకేతాలు కూడా ఇచ్చారు. భీభత్సమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలతో కూడా నిండి ఉంది ఈ ట్రైలర్. డింపుల్ హయాతి విశాల్ కు జోడీగా కనిపిస్తుంది.వీళ్ళ పెయిర్ బాగుంది. డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. టెక్నికల్ గా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే భరోసా ఇస్తుంది ఈ మూవీ ట్రైలర్.

కవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ , యువన్ శంకర్ రాజా అందించిన నేపధ్య సంగీతం కూడా హైలెట్స్ అని చెప్పొచ్చు.ఈ చిత్రంలో యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పి.ఎ తులసి, రవీనా రవి వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అభిమన్యుడు’ తర్వాత విశాల్ నుండీ వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘పందెం కోడి2’ కొంత పర్వాలేదు అనిపించినా ‘అయోగ్య’ ‘చక్ర’ ‘ఎనిమి’ ‘యాక్షన్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘సామాన్యుడు’ ట్రైలర్ బాగుంది కాబట్టి అతను హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. ‘సామాన్యుడు’ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus