మంచు మోహన్ బాబు అంటే టాలీవుడ్ లోనే కాదు తన కుటుంభంలో సైతం అందరికీ భయమే. ఆయన మాటే వేదం…ఆయన చెప్పిందే శాసనం. అయితే ఆయన తీసుకునే నిర్ణయాన్ని ఎవ్వరు కనీసం నో చెప్పే అవకాశం ఉండదు. అలాంటి బలమైన పట్టు ఉన్న మోహన్ బాబు నిర్ణయాన్ని తన కుమారుడు తిరస్కరించాడని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇంతకీ ఇంతా విషయం…అంటే…రాజకీయాలు అంట…రాజకీయాలకు…మోహన్ బాబు నిర్ణయానికి లింక్ ఏంటి అంటే…అన్నగారు పార్టీ పెట్టిన కొత్తలో మోహన్ బాబు యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత మారిన పరిణామాలతో మోహన్ బాబు రాజకీయాలకు దూరమైపోయాడు. అయితే మళ్ళీ త్వరలో రాజకీయాల్లోకి వెళ్లేందుకు మోహన్ బాబు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా స్వయంగా మోహన్ బాబు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. దానిపై విష్ణు మాట్లాడుతూ….ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళడం తనకు ఇష్టం లేదు అని, దానికి గల కారణం ఏంటంటే…ప్రస్తుతం తాము నమ్ముకున్న సినిమా రంగంలో ఎంత కాలమైనా గౌరవంగా జీవించవచ్చు అని..అయితే రాజకీయాల్లోకి వెళితే పరిస్థితి మరోలా ఉంటుందని మంచు విష్ణు భావనగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు సినీ స్టార్లు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలిసాక కూడ తన తండ్రి రాజకీయాలలోకి వెళ్ళడం తనకు ఇష్టం లేదని తన మనసులో మాటను బయట పెట్టాడు. మరి దీనిపై మోహన్ బాబు ఏమంటాడో చూడాలి. ఏదీ ఏమైనా…విష్ణు చెప్పిన మాటల్లో నిజం ఉంది అన్న భావన అందరికీ కలుగుతుంది.