బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ అత్యధిక రేటింగ్ కైవసం చేసుకుని దూసుకుపోతుంది ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. సెమినార్ పూర్తి అయిన తర్వాత విశ్వనాథం జగతి మహేంద్రాలకు కాలేజ్ మొత్తం చూపిస్తారు అయితే ఇది చూసినటువంటి శైలేంద్ర పిన్ని నిజంగానే ఆడపులి మమ్మీ చెప్పినట్టు ఇన్ని కష్టాలను దాటుకొని చివరికి తన కొడుకును కలుసుకుంది అంటూ మండి పడుతుంటారు.
కాలేజ్ మొత్తం చూసిన మహేంద్ర జగతి మీ కాలేజ్ బాగుంది సెమినార్ కూడా చాలా బాగా జరిగింది ఇలాంటి సెమినార్స్ ఇంకా కండక్ట్ చేయమని చెప్పడంతో తప్పకుండా అలాగైనా మీలాంటి గొప్ప వాళ్ళు ఇక్కడికి వస్తారు అనడంతో మమ్మల్ని మరి అంత గొప్ప వాళ్ళని చేయకండి మీ కాలేజీకి రావడం నిజంగా మా అదృష్టం అని మహేంద్ర చెబుతాడు. మీ కాలేజీకి రావడం వల్ల నా కొడుకుని తిరిగి నేను చూసుకోగలిగాను అంటూ జగతి మనసులో అనుకుంటుంది అలాగే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని జగతి చెప్పడంతో సరే అంటాడు విశ్వనాథం ఇక్కడ కాదు మీ ఛాంబర్ లో మాట్లాడాలని చెప్పి ముగ్గురు అక్కడికి వెళ్తారు.
ఛాంబర్ లోకి వెళ్లిన తర్వాత జగతి మాట్లాడుతూ సెమినార్లో రిషి ఇచ్చిన స్పీచ్ చాలా బాగుంది అలాగే వసుధార కూడా చాలా టాలెంటెడ్ లెక్చరర్ మాదిరి కనపడుతుంది ఇక వీరిద్దరూ మేము చేయబోయే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో భాగమతే బాగుంటుంది అని అనుకుంటున్నాను వారు మా కాలేజ్ కి రాకపోయినా పర్లేదు ఇక్కడి నుంచి మా ప్రాజెక్టులో భాగమైతే చాలు వారిని ఈ ప్రాజెక్టులో భాగం చేయమని అడుగుతుంది. మీ ఆలోచన బాగుంది కానీ ఒకసారి రిషిను అడిగి చెబుతాను అంటే టైం తీసుకోండి పర్లేదని చెప్తుంది అయితే రిషి వసుధార గురించి జగతి అలా అడగడంతో విశ్వనాథం సందేహాలు వ్యక్తం చేస్తారు.
మరోవైపు జగతి ఇచ్చిన ఓకే డస్ట్ బిన్ లో పడేస్తాడు అయితే అది డిస్టబెన్లో పడకుండా వసుధార పట్టుకుంటుంది పువ్వులు చాలా సున్నితం వాటిని ఎందుకు అలా విసిరేస్తారు అంటే నా కోపం పువ్వుల పైన కాదు అని రిషి మాట్లాడతారు. అయినా నీకు కాలు నొప్పి కదా ఎందుకు తిరుగుతున్నావ్ అని అడగడంతో నాకు బాగుందని చెబుతుంది వసుధారా నిన్ను కాదు అనాలి ఆ ఏంజెల్ ఎక్కడుంది అనడంతో పార్కింగ్ దగ్గర ఉందని చెబుతుంది . రిషి వెళ్తుండగా మహేంద్ర తనని హగ్ చేసుకుని ఎన్ని సంవత్సరాలు మాకు దూరంగా ఎలాఉన్నావు నీకోసం నిద్రాహారాలు మాని పిచ్చవాడిలా వెతికాను అని తన కొడుకును పట్టుకొని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
డాడీ మీకు తెలియదేమో నేను ఒక మోసగాడిని మనిద్దరి మధ్య ఆటాచ్మెంట్ లేదుమనం పరిస్థితులు మాత్రమే అనడంతో అలా అని నా కళ్ళలోకి చూసి చెప్పు అని మహేంద్ర అడుగుతారు.ఇన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు మీరు వచ్చిన ప్రశాంతతను చెడగొట్టారని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రిషి వసుధార విశ్వనాథం ఏంజెల్ అందరూ ఇంటికి వెళ్ళగా విశ్వనాథం మాత్రం ఈరోజు సెమినార్లో రిషి వసుధారకు బాగా దిష్టి తగిలి ఉంటుందని వారికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు.
అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా సెమినార్ చాలా బాగా జరిగింది.రిషి మీకు ఇది మొదటి సెమినారా లేక ఇది వరకు మీరు ఎక్కడైనా లెక్చరర్ గా పనిచేశారా అంటూ విశ్వనాథం రిషి వసుదారుల గురించి కూడా కాస్త సందేహాలను వ్యక్తం చేస్తారు. ఇంతటితో ఈ (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.