Vishwak Sen, Balakrishna: తీసేస్తారు, తొక్కేస్తారు అన్నారు.. నేను తగ్గను, తగ్గితే నేను కాను: విశ్వక్‌

నందమూరి బాలకృష్ణను (Balakrishna) అందరూ భోళా శంకరుడు అని అంటారు. అంటే మనసులో ఏముందో బయటకు అలానే చెప్పేసే మనిషి. ఎక్కడా కల్మశం లేకుండా చిన్నపిల్లాడి మనస్తత్వంతో ఉంటారు అని కూడా చెబుతుంటారు. అలా ఎందుకు అంటున్నారో కొన్ని ఉదాహరణలు కూడా చెబుతుంటారు. ఇక తనవాళ్లు అనుకుంటే బాలయ్య ఎంతో ప్రేమ చూపిస్తారు అని కూడా చెబుతుంటారు. దీనికి తాజా ఉదాహరణను కథానాయకుడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) చెప్పారు. విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కి ఈ నెల 31న విడుదలవుతున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) .

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్రబృందం ఇటీవల ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలో విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ బాలయ్య గురించి, అతని గొప్పతనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు షూటింగ్‌లో గాయాలు అయినప్పుడు బాలయ్య ఫోన్‌ చేసిన మాట్లాడిన విషయం గురించి కూడా చెప్పాడు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా షూటింగ్‌ కోసం ఫైట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు రోడ్డుపైన పడిపోయాడట విశ్వక్‌సేన్‌. దేవుడి దయ వల్ల తనకు ఏమీ కాలేదట.

అయితే విశ్వక్‌కి దెబ్బ తగిలిందని తెలిసి బాలకృష్ణకు తెలిసి ఫోన్‌ చేసి మాట్లాడారట. బాలయ్య ప్రేమను చూశాక నా కళ్లల్లో నీళ్లొచ్చాయి అని విశ్వక్‌సేన్‌ చెప్పుకొచ్చాడు. కుటుంబం తర్వాత తనపై అంత ప్రేమ చూపించింది ఆయనే అంటే భావోద్వేగానికి గురయ్యాడు విశ్వక్‌. ‘తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌’ అని రాసి వున్న ఓ పెయింటింగ్‌ నేపథ్యంలోనే సినిమా చిత్రీకరణ ప్రారంభించామని, ఇప్పుడు ఆయన జయంతి రోజే వేడుక జరుగుతోందని గుర్తు చేసుకున్నాడు.

ఇక ఐదేళ్ల కిందట తన ‘ఫలక్‌నుమా దాస్‌’ (Falaknuma Das) సినిమా విడుదలైందని, ఆ సినిమా వల్లే నోట్లోకి ఐదు వేళ్లు వెళ్తున్నాయని చెప్పిన.. ఈ పొగరుతో ఉంటే తీసేస్తారు, తొక్కేస్తారు అప్పట్లో అనేవారనే విషయం గుర్తు చేసుకున్నాడు. ఎవరు ఏమన్నా, ఎన్ని విధాలుగా మాట్లాడినా తాను ఏ రోజూ క్యారెక్టర్‌ని చంపుకోలేదని, తనను తగ్గించుకోమన్న ఆ క్వాలిటీకే అభిమానులు వచ్చారని తన గురించి చెప్పాడు విశ్వక్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus