Vishwak Sen: ఆ జోనర్‌ సినిమా చేస్తానంటున్న విశ్వక్‌సేన్‌.. దర్శకులు రెడీనా?

ఫలితం ఎలా ఉన్నా? ప్రయోగం చేయడం ముఖ్యం! అనుకునే హీరోల్లో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) ఒకడు. వరుస సినిమాలు చేస్తూనే ఎక్కడా మూస సినిమాలకు తావు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆయన చేసిన, చేస్తున్న సినిమాలు చూస్తే ఎవరైనా ఈ మాటే అంటారు. ఈ క్రమంలో మరో జోనర్‌లో సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. అయితే ఆ సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. ఎందుకంటే అది హారర్‌. అవును, విశ్వక్‌సేన్‌ త్వరలో ఓ హారర్‌ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

వ్యక్తిగతంగా తనకు హారర్‌ జానర్‌ అంటే ఇష్టం ఉండదని, ఆ నేపథ్యంతో రూపొందిన చిత్రాలేవీ తనను భయపెట్టలేదని విశ్వక్‌సేన్‌ చెప్పాడు. థ్రిల్‌ కోసం ఏ హారర్‌ చిత్రాన్ని చూసినా నిరాశే ఎదురయ్యేదని చెప్పాడు. అందుకే ఒకవేళ అవకాశం వస్తే ప్రేక్షకులు, అభిమానుల కోసం హారర్‌ మూవీస్‌ చేస్తానని చెప్పేశాడు. దీంతో దర్శకరచయితలు విశ్వక్‌ డేట్‌ కావాలంటే అలాంటి సినిమాలు తీసుకురావాల్సిందే. కథ నచ్చితే మిగిలినవన్నీ ఆలోచించడు అని విశ్వక్‌కి పేరు.

కాబట్టి ఆ పని దర్శకరచయితల మీద ఉంది. ఇక విశ్వక్‌ నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’  (Gangs of Godavari) సినిమా విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మే 31న వస్తోంది. విశ్వక్‌సేన్‌ హిట్‌ చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’ (Falaknuma Das) కూడా మే 31నే వచ్చింది. అందుకే ఆ డేట్ మీద ఆయనకు నమ్మకం చాలానే ఉంది అంటున్నారు. 1960ల నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా తెరకెక్కించారు.

విలేజ్‌ పాలిటిక్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకి కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకుడు. నేహా శెట్టి (Neha Shetty) , అంజలి (Anjali)  హీరోయిన్లుగా నటించారు. సినిమా రిలీజ్‌ దగ్గరగా ఉండటంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించనున్నారు. దీనికి విశ్వక్‌కు బాగా ఇష్టమైన ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరి ఈ వేదిక మీద బాలయ్య ఎంత సందడి చేస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus