Vishwak Sen: కెరీర్‌ గ్రోత్‌ అంటే ఏంటో వివరంగా చెప్పిన విశ్వక్‌సేన్‌.. ఏం చెప్పాడంటే?

తొలి సినిమాకు ఎలా ఉన్నాడో.. పదో సినిమాకూ అలానే ఉంటే ఆ హీరో కచ్చితంగా వారసుడే. అదే ఆ నటుడిలో డిఫరెన్స్‌ బాగా కనిపిస్తే కచ్చితంగా సోలోగా వచ్చి.. ఇక్కడి వారిని స్నేహితుల్ని చేసుకుని ఎదిగినట్లు. ఇక ఓ మోస్తరు డిఫరెన్స్ కనిపిస్తే తనంతట తాను ఎదిగినట్లు. ఇవన్నీ ఎలా తేలుతాయంటే తొలి సినిమాకు, లేటెస్ట్ సినిమాకు అతనిలో, కెరీర్‌లో గ్రోత్‌ చూస్తే సరి. అలాంటి ఓ గ్రోత్‌ గురించి ఇప్పుడు చూద్దాం.

Vishwak Sen

ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్‌లో ముందుకెళ్తున్న హీరోల్లో విశ్వక్‌సేన్‌ ఒకడు. ‘వెళ్ళిపోమాకే’ (Vellipomakey) అనే చిన్న సినిమాతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు ఓ స్థాయి స్టార్‌గా ఎదిగాడు విశ్వక్‌సేన్‌  (Vishwak Sen) . ఈ క్రమంలో సినిమా ఆఫర్‌ చేస్తే రిజెక్ట్ చేసిన హీరోయిన్‌.. ఇప్పుడు అతని సినిమాలో నటించింది. ఇది చాలదా విశ్వక్‌ సేన్‌ గ్రోత్‌ ఎలా ఉందో చెప్పడానికి.

విశ్వక్‌ సేన్‌ చెప్పిన ఆ హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) . విశ్వక్‌సేన్‌ నటించి దర్శకత్వం వహించిన ‘ఫలక్‌నుమా దాస్’ (Falaknuma Das) సినిమా కోసం శ్రద్ధా శ్రీనాథ్‌ను కాంటాక్ట్‌ అయ్యాడు విశ్వక్‌సేన్‌. అంతగా డబ్బులు లేకపోవడం, ఖర్చు తగ్గించాలనే ఆలోచనతో బస్సులో బెంగళూరు వెళ్లి మరీ విశ్వక్‌ ఆమెకు కథ చెప్పాడట. కానీ ఆమె నో చెప్పింది. దీంతో ఇద్దరు కొత్త హీరోయిన్లను సినిమా కోసం తీసుకున్నారు.

అయితే ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)  సినిమాలో తనకు జోడీగా శ్రద్ధా శ్రీనాథే నటించింది అని గుర్తు చేశాడు విశ్వక్‌. అంతేకాదు ఈ విషయం తనకు కిక్కిచ్చిందని కూడా చెప్పాడు. నిజమే మరి నో చెప్పిన హీరోయినే తనతో ఇప్పుడు నటిస్తుంటే అలానే ఉంటుంది మరి. అన్నట్లు ‘మెకానిక్ రాకీ’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఇన్నాళ్లూ బజ్‌ రాకుండా ఆపిన విశ్వక్‌ ఇప్పుడు బజ్‌ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. అదేంటి బజ్‌ ఆపొచ్చా అనుకుంటున్నా.. ఆయనే చెప్పాడు ఆమాట.

‘ది రానా దగ్గుబాటి షో’ ట్రైలర్…రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus