ఓ హీరో నో చెప్పిన కథని మరో హీరోతో తెరకెక్కించి హిట్ కొట్టడం దర్శక నిర్మాతలకు అలవాటే. ఎన్నో సార్లు ఈ అద్భుతం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ‘ఎవరు’ వంటి రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న ‘పివిపి’ వారు ఇప్పుడు మరో రీమేక్ ను తెరకెక్కించాలని రైట్స్ ను కొనుగోలు చేసి పెట్టుకున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవలె’ ను రీమేక్ చెయ్యాలి అని వారు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా మొదట ఈ ప్రాజెక్ట్ లో హీరో కోసం అక్కినేని అఖిల్ ను సంప్రదించారట. ఇటువంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ కు అఖిల్ కచ్చితంగా సెట్ అవుతాడు అనే ఉద్దేశంతో అతన్ని సంప్రదించారని తెలుస్తుంది. పైగా అతని తండ్రి నాగార్జునతో ‘ఊపిరి’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తీసిన సంస్థ కాబట్టి అఖిల్ కచ్చితంగా ఓకే చెప్తాడు అని నిర్మాతలు భావించారట. కానీ ఊహించని విధంగా అతను నో చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో విశ్వక్ సేన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.
అతనితో ఈ ప్రాజెక్ట్ తీస్తే.. ఇంకా లో బడ్జెట్ లోనే ఫాస్ట్ గా సినిమా పూర్తైపోతుంది అని వారి ఆలోచన. విశ్వక్ సేన్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించాడని తెలుస్తుంది. నిజానికి అఖిల్ నో చెప్పేసరికి అడివి శేష్ తో ఈ రీమేక్ ను తియ్యాలి అని అనుకున్నా.. అతను రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో .. పివిపి వారు విశ్వక్ సేన్ ను తీసుకోవాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది.