Vishwak Sen: శివుడి పాత్రకు బాలయ్య రైట్ అంటున్న విశ్వక్.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో బాలయ్య (Balakrishna) ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే. అఖండ (Akhanda) సినిమాలో అఘోర పాత్రలో నటించి ఆ సినిమా సక్సెస్ లో బాలయ్య కీలక పాత్ర పోషించారు. సినిమా సినిమాకు భిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారని చెప్పవచ్చు. విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా బాలయ్య గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మెకానిక్ రాకీ  (Mechanic Rocky) సినిమాలో విశ్వక్ సేన్ నటిస్తుండగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

గామి సినిమా కోసం వారణాసిలో 15 రోజులు అఘోరా పాత్రలో తిరిగానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. ఆ సమయానికి ఫలక్ నుమా దాస్ (Falaknuma Das) మూవీ రిలీజ్ కాలేదని ఆయన వెల్లడించారు. కాబట్టి నన్ను ఎవరూ గుర్తు పట్టే అవకాశం లేదని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. నేను అఘోరా అనుకొని చాలామంది వచ్చి భిక్ష కూడా వేశారని విశ్వక్ సేన్ తెలిపారు.

ఆ 15 రోజులు చాలా ఎమోషనల్ గా ఉన్నానని ఒక రకమైన జోన్ లో ఉన్నానని అలా శివుడితో నాకు బంధం ఏర్పడిందని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. శివుడి రోల్ లో బాలయ్య బాగుంటారని ఒకవేళ బాలయ్య డ్రాప్ అయితే శివుడి పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఉన్నానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ప్రస్తుతం డివోషనల్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో శివుడి పాత్ర గురించి విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

విశ్వక్ సేన్ తర్వాత సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. గామి (Gaami) , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాలతో మెప్పించిన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus