Vishwak Sen: కేసు వేసినోడు బానే ఉన్నాడు.. మధ్యలో దేవి బలైపోయింది..!

  • May 2, 2022 / 10:29 PM IST

విశ్వక్‌ సేన్‌ తన ‘ఆశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రం పబ్లిసిటీ కోసం ఓ ప్రాంక్ వీడియో చేశాడు. నడిరోడ్డు పై ఓ అభిమాని చేత పెట్రోల్‌తో సూసైడ్‌ ప్రయత్నం చేయించుకుంటున్నట్టు ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలి అనుకున్నాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అరుణ్‌ కుమార్‌ అనే అడ్వాకేట్ హీరో విశ్వక్‌ సేన్‌ మరియు ఆ మూవీ టీం పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశాడు. అందుకు విశ్వక్ సేన్ మరియు ‘ఆశోకవనంలో అర్జున కల్యాణం’ టీం అతని పరిస్థితిని వివరించి కంప్లైంట్ వెనక్కి తీసుకునే విధంగా రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కానీ ఇంతలో ఓ టీవీ ఛానెల్ ఈ విషయాన్ని మరింత కాంట్రవర్సీ చేసి టి.ఆర్.పి పెంచుకోవడానికి ఓ లైవ్ డిబేట్ షో నిర్వహించింది. ప్రముఖ యాంకర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన దేవి నాగవల్లి ఈ షోని హోస్ట్ చేసింది. సెలబ్రిటీలను రెచ్చగొట్టి వారి సహనం కోల్పోయి నోరు జారేలా చేయడంలో ఆ టీవీ ఛానల్ సిబ్బంది ఆరితేరిన వాళ్ళు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే హీరో విశ్వక్ సేన్ నోరు జారాడు. ‘F***’ అనే పదాన్ని వాడుతూ రెచ్చిపోయాడు విశ్వక్ సేన్.

ఇదే ఆ టీవీ ఛానల్ వాళ్లకి కావాల్సింది. అయితే యాంకర్ దేవి మాత్రం ‘గెటవుట్ ఆఫ్ మై స్టూడియో’ అంటూ నోరు పారేసుకుంది. ఈ విజువల్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇది కూడా ప్రాంక్ అనుకున్నారు. గతంలో ఇలాంటివి ప్రేక్షకులు చాలా చూసి ఉన్నారు కాబట్టి.. అందులోనూ ఆ టీవీ ఛానల్ వాళ్ళకి కావాల్సింది టిఆర్పీ మాత్రమే కాబట్టి.. వాళ్ళకి కూడా ఇది బాగానే వర్కౌట్ అయ్యింది. కాకపోతే ప్రాంక్ చేసిన విశ్వక్ సేన్ బాగానే ఉన్నాడు, కేసు వేసిన వ్యక్తి బాగానే ఉన్నాడు.. ఇప్పుడు అనవసరంగా దేవి నాగవల్లి ఇరుక్కుంది.

ఘోరంగా ట్రోల్ అవుతుంది. ఈ విషయంలో విశ్వక్ సేన్ కూడా సారి చెప్పను అన్నాడు. ఒక్క ‘F***’ అనే పదాన్ని వాడినందుకు తప్ప మిగిలిన విషయంలో తన తప్పు లేదని… కానీ మీడియా వేదికగా అలాంటి పదం వాడినందుకు ఓ సారి నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus