నాని సమర్పణలో మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్..!

  • January 31, 2020 / 03:23 PM IST

‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ ను స్థాపించి నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘అ!’ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా రోపొందుతున్న ‘హిట్’ చిత్రానికి నాని సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రశాంతి తిపిరినేని ఈ చిత్రానికి అసలు నిర్మాత. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ ‘హిట్’ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ‘హిట్’ టీజర్ ను విడుదల చేశారు.

హీరో విశ్వక్ షేన్.. విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ మిస్సింగ్ పర్సన్ కేసు నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్టు టీజర్ స్పష్టం చేస్తుంది. ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. విశ్వక్ సేన్.. రుహాని శర్మ మధ్య వచ్చే లిప్ లాక్ ఈ టీజర్ కే హైలెట్ గా నిలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ కి ఉండాల్సిన ఆటిట్యూడ్ లుక్ హీరో విశ్వక్ సేన్ బాగా ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తుంది. సస్పెన్సు ఎలెమెంట్స్ తో కూడిన ఈ టీజర్ సినిమా పై అంచనాల్ని పెంచేలా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus