Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!
- January 29, 2026 / 10:48 PM ISTByPhani Kumar
‘విశ్వంభర'(Vishwambhara) 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాలి. కానీ ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా వేసినట్టు మొదట చెప్పారు. పోనీ తర్వాత అయినా రిలీజ్ చేశారా? అంటే అదీ లేదు. కొన్ని నెలలు గడిచాక.. ఓ గ్లింప్స్ వదిలారు. అలాగే ‘విశ్వంభర’ సినిమా విషయంలో వి.ఎఫ్.ఎక్స్ పరంగా, క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకూడదు అనే ఉద్దేశంతో సినిమాని 2026 సమ్మర్ కి వాయిదా వేస్తున్నట్టు స్వయంగా చిరంజీవి ఓ వీడియో ద్వారా ప్రకటించారు.
Vishwambhara
80 శాతం షూటింగ్ అయిపోయినప్పటికీ ఆ సినిమాని పక్కన పెట్టి.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ని కంప్లీట్ చేశారు చిరు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. చిరు కూడా ఆనందంలో ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి ఎక్కువగా హాజరుకాలేకపోయిన చిరు.. నిన్న సరదాగా తనకి నచ్చిన జర్నలిస్టులను పీఆర్ ద్వారా పిలిపించుకుని ముచ్చటించారు. ఇదే టైమ్లో చిరుతో వాళ్ళు చాలా విషయాల గురించి చర్చించారు.

అందులో ‘విశ్వంభర’ రిలీజ్ టాపిక్ ఒకటి. ఈ సినిమాని జూలై 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చిరు చెప్పుకొచ్చారు. అది కూడా సీజీ వర్క్ పై క్లారీటీ వచ్చిన తర్వాతే.. అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని తెలిపారు. అంతకు మించి ‘విశ్వంభర’ టాపిక్ ని కంటిన్యూ చేయలేదు. మరోవైపు ‘విశ్వంభర’ వంటి సినిమా సమ్మర్ హాలిడేస్లో రిలీజ్ చేస్తేనే ఫ్యామిలీ ఆడియన్స్,కిడ్స్ వంటి వారు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పిన చిరు.. ఇప్పుడు ఆ సీజన్ ని మిస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకే తెలియాలి.
‘విశ్వంభర’ నుండి ఇప్పటివరకు ఒక పాట బయటకొచ్చింది. దానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. 2 గ్లింప్స్..లు వచ్చాయి. మొదటి దానితో పోలిస్తే.. రెండోది బెటర్ గా ఉన్నా.. బజ్ తీసుకురాలేకపోయింది.









