Vishwambhara vs Kubera: అప్పుడు ‘గాడ్ ఫాదర్’ ‘ఘోస్ట్’.. ఇప్పుడు ‘విశ్వంభర’ ‘కుబేర’?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) తో బిజీగా ఉన్నారు. నిజానికి జనవరి 10 నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం సినిమాని వాయిదా వేశారు. తర్వాత మే 9న ‘విశ్వంభర’ థియేటర్స్ కి రావడం ఖాయమన్నట్టు ప్రచారం జరిగింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) రిలీజ్ డేట్ కాబట్టి.. ‘విశ్వంభర’ కి ఆ హైప్ కలిసి వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ వీఎఫ్ఎక్స్ పనులు బ్యాలెన్స్ ఉండటం వల్ల.. ఇప్పుడు ఆ డేట్ కూడా డౌట్ గానే ఉంది.

Vishwambhara vs Kubera

మరోపక్క విశ్వంభర ఓటీటీ డీల్ కూడా ఫైనల్ కావాలి. అది ఫైనల్ అయితే రిలీజ్ డేట్ ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జూన్ లో ఇప్పటివరకు ఏ పెద్ద సినిమా ఫైనల్ కాలేదు. కాకపోతే జూన్ 20 కి ‘కుబేర’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఆ సినిమా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ధనుష్  (Dhanush)  ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఇదే డేట్ కి ‘విశ్వంభర’ వస్తుందంటే.. ‘కుబేర’(Kubera) ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. పైగా చిరంజీవి సినిమాకి పోటీగా వస్తే ఎలా ఉంటుందో ‘ఘోస్ట్’ తో (Ghost) నాగార్జునకి Nagarjuna) ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ సినిమా రిలీజ్ రోజునే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ మేనియా ముందు ‘ఘోస్ట్’ నిలబడలేకపోయింది.

అలా అని ‘గాడ్ ఫాదర్’ (God Father) కూడా సూపర్ హిట్ అవ్వలేదు. కానీ ఓపెనింగ్స్ వరకు గట్టిగానే రాబట్టింది. అందుకే ‘విశ్వంభర’.. ‘కుబేర’ కి ఒక వారం ముందు లేదా వారం తర్వాత వస్తే బెటర్ అనేది ట్రేడ్ పండితుల అభిప్రాయం. ఇక ‘విశ్వంభర’ కి ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట్, ‘కుబేర’ ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus