వాస్తవానికి ఆగస్టు 15 కి ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ కాకపోవడం వల్ల డిసెంబర్ 6కి వాయిదా పడింది. ఆగస్టు 15 అనేది పాన్ ఇండియా సినిమాలకి మంచి డేట్ అని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే లాంగ్ వీకెండ్ వల్ల కలెక్షన్స్ బాగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అలాగే టాక్ బాగుంటే లాంగ్ రన్ కి కూడా ఛాన్స్ ఉంటుంది. దీంతో ఈ ఛాన్స్ అస్సలు మిస్ కాకూడదని ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ముందుగా రేసులోకి వచ్చింది.
ఆ తర్వాత గోపీచంద్ (Gopichand) – శ్రీను వైట్ల (Srinu Vaitla) ..ల ‘విశ్వం’ (Viswam) కోసం కూడా ఈ డేట్ అనుకున్నారు. కానీ ఆ టైంకి షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేకపోవడం వల్ల లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) నటించిన ‘ఆయ్’, నివేదా థామస్ (Nivetha Thomas) ’35’ వంటి చిత్రాలు కూడా అదే డేట్ కి అనౌన్స్ చేశారు. ఇవేవీ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ కి పోటీ కాదు.
టీం కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉంది. కానీ అనూహ్యంగా ఆగస్టు 15 కి రవితేజ (Ravi Teja) – హరీష్ శంకర్ (Harish Shankar) ..ల ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. బాలీవుడ్లో రూపొందిన ‘రైడ్’ కి ఇది రీమేక్. సో ‘డబుల్ ఇస్మార్ట్’ కి గట్టి పోటీ ఇచ్చే సినిమా ‘మిస్టర్ బచ్చన్’ అనడంలో సందేహం లేదు.