ఓటీటీలో కొత్త సినిమా.. రీచ్ ఉంటుందా..?

లాక్ డౌన్ కారణంగా ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో మేకర్లు కొత్తగా ఆలోచిస్తూ.. సరికొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తున్నారు. ఈ లాక్ డౌన్ లో కొత్త కాన్సెప్ట్ లతో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘విటమిన్ షీ’. రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా కథ, అందులో చూపించిన కొన్ని అంశాలు చాలా కొత్తగా అనిపిస్తాయి. ‘రోబో’ సినిమాలో యంత్రం.. మనిషితో ప్రేమలో పడడం చూశాం.

ఇక ఈ సినిమాలో వాయిస్ అసిస్టెంట్.. హీరోతో ప్రేమలో పడుతుంది. అంతేకాదు.. హీరో, హీరోయిన్లకి బ్రేకప్ అయ్యేలా చేస్తుంది. ఈ యాంగిల్ తో పాటు కరోనా వైరస్ పుట్టుక వెనుక కుట్ర దాగుందేమో అనే అనుమానాన్ని రేకెత్తించేలా ఈ సినిమాలో కొన్ని అమాశాలను టచ్ చేశారు. ‘లైఫ్ 3.O’ అనే పుస్తకం నుండి ప్రేరణపొంది దర్శకుడు ఈ సన్నివేశాలు రాసుకున్నాడనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. గతంలో ‘పేపర్ బాయ్’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు జయశంకర్ ఈ సినిమాను రూపొందించాడు.

కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ తానై ఈ సినిమాను తెరకెక్కించాడు. చిన్న సినిమాగా వచ్చిన ‘విటమిన్ షీ’ కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంటుంది. కానీ అందరూ కొత్తవాళ్లు ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా దృష్టి పెట్టినట్లు లేరు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా సరికొత్త ఎక్స్ పీరియన్స్ కావాలనుకునే వారు ఈ సినిమాను ఇష్టపడతారు. మరి ఇది జనాలను ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus