తన ప్రేమ కథను చెప్పిన వైవా హర్ష!

యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయి, తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు వైవా హర్ష. రీసెంట్ గా హర్షకు అక్షర అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకకు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుష్మితా కొణిదెల హాజరయ్యారు. ప్రస్తుతం వైవా హర్ష నిశ్చితార్ధపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. హర్ష తన లవ్ స్టోరీను మీడియా ముందు వెల్లడించాడు.

అక్షర తనకు నాలుగేళ్లుగా తెలుసని.. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన తనతో మొదట్లో స్నేహం మాత్రమే ఉండేదని.. ఆ తరువాత ప్రేమకు దారి తీసిందని చెప్పాడు. రెండేళ్లుగా ఇద్దరం డేటింగ్ లో ఉన్నామని.. జీవితాంతం ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. అక్షరతో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషించిందని.. కానీ అక్షర తండ్రి గౌరీ శంకర్ మాత్రం కొంతసమయం తీసుకున్నారని చెప్పాడు. అప్పటివరకు అక్షర తమ ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పకపోవడంతో ఆయన కొంచెం భయపడ్డారని..

ఆ తరువాత అక్షర తండ్రితో కొంత సమయం గడిపేసరికి ఆయన తనను పూర్తిగా అర్ధం చేసుకొని.. పెళ్లికి అంగీకరించారని చెప్పుకొచ్చాడు. జూన్, జూలై నెలల్లో వివాహం ఉండనున్నట్లు చెప్పాడు. తన సోదరి అమెరికాలో ఉంటుందని.. ఆమె వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటామని వెల్లడించాడు.

1

2

3

4

5

6

7

8


Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus