VJ Sunny: ఇంటర్వ్యూ : ‘సౌండ్ పార్టీ’ మూవీ గురించి ‘బిగ్ బాస్’ సన్నీ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్5’ విన్నర్ సన్నీ హీరోగా రూపొందిన మరో సినిమా ‘సౌండ్ పార్టీ’. ‘ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్ పై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు . వీజే స‌న్నీ సరసన హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటించింది. ‘జయ శంకర్’ సమర్పకులుగా వ్యవహరించారు. సంజ‌య్ శేరి దర్శకుడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో విజె సన్నీ పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీ కోసం :

ప్ర) ‘సౌండ్ పార్టీ’ జర్నీ ఎలా మొదలైంది?

సన్నీ: ‘బిగ్ బాస్’ తర్వాత నేను చేసిన ప్రాజెక్టులో బెస్ట్ ప్రాజెక్టు ‘సౌండ్ పార్టీ’ అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాను.

ప్ర) ‘సౌండ్ పార్టీ’ కథాంశం ఏంటి?

సన్నీ: తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండింగ్ ను ఫన్నీ వేలో చూపించాం. డబ్బుల కోసం ఫాదర్ అండ్ సన్ ఏం చేశారనేది.. ఏం చేయకూడదు అనేది ఇందులో చూపించాం.! అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మూవీ ఇది.

ప్ర) ఇందులో బిట్ కాయిన్ ఎపిసోడ్ కీలకంగా ఉంటుంది అని నిర్మాతలు చెప్పారు?

సన్నీ: అవును ఇందులో బిట్ కాయిన్ కి కూడా కీలకపాత్ర ఉంటుంది. ఈ సినిమాకు దర్శకుడు సంజయ్ నన్ను రిఫర్ చేశారు. నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంజయ్ స్క్రిప్ట్ ను పక్కాగా తెరపైకి తెచ్చారు.

ప్ర) ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే హైలెట్ ఏంటి అంటే ఏం చెబుతారు?

సన్నీ: అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. సినిమాలో పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. జయశంకర్ గారు ప్రెజెంటర్ గా ఈ సినిమాకు చాలా హెల్ప్ చేశారు.

ప్ర) హీరోయిన్ గురించి చెప్పండి.. ఇప్పుడు ఆమె ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నారు?

సన్నీ: అవును.. ముంబై హీరోయిన్ కాకుండా టౌన్లో పెరిగిన అమ్మాయి కావాలి అనుకున్నాం. హ్రితిక శ్రీనివాస్ .. ఆమని గారి మేనకోడలు అని నాకు మొదట తెలీదు. తర్వాత తెలిసి షాక్ అయ్యాను. ఆమె చాలా డౌటు ఎర్త్. చాలా డెడికేటెడ్ కూడా.! హీరోయిన్ గా ఈమె మంచి పేరు తెచ్చుకుంటుంది.

ప్ర) ఈ సినిమాకి ‘ఎఫ్ 3’ కి పోలికలు కనిపిస్తున్నాయి అని ట్రైలర్ చూసిన వారు చెబుతున్నారు?

సన్నీ: కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయేమో కానీ.. ఓవరాల్ గా అది వేరు, ఇది వేరు. నాకు అనిల్ రావిపూడి గారు అంటే చాలా ఇష్టం. వెంకటేష్ గారు కూడా..!

ప్ర) ఈ సినిమాలో శివన్నారాయణ గారిని ఫుల్ లెంగ్త్ రోల్ కి తీసుకున్నారు?

సన్నీ: అవును.. శివన్నారాయణ గారిని చూస్తే ఎవరికైనా ఇప్పటికీ అమృతం సీరియల్ గుర్తొస్తుంది. ఆయన నేను తండ్రి కొడుకులుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం అనే నమ్మకం నాకు ఉంది. కుబేర్ కుమార్ గా ఆయన నటన గుర్తుండి పోతుంది. చిన్న చిన్న పంచులతో నేచురల్ కామెడీని బాగా పండించారు ఆయన.ఈ సినిమా చూశాక ఇలాంటి గొప్ప నటుడికి దక్కాల్సిన గౌరవం ఎందుకు దక్కలేదు అనే డౌట్ వస్తుంది?

ప్ర) ‘అన్ స్టాపబుల్’ సినిమాల రివ్యూల విషయంలో మీరు కాంట్రావర్సీ ఎదుర్కొన్నారు?

సన్నీ: దానికి నేను (VJ Sunny) క్లారిటీ ఇవ్వాలి. అది అందరి రివ్యూ రైటర్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన ట్వీట్ కాదు. ఓ వ్యక్తి మా సినిమా ప్రీమియర్ అవ్వకుండానే రివ్యూ పోస్ట్ చేశాడు. అడిగితే.. ఎడిటింగ్ రూమ్లోనే చూసేసాను అన్నాడు. అతన్ని ఉద్దేశించి మాత్రమే ఆ ట్వీట్ వేయడం జరిగింది. నేను కూడా జర్నలిస్ట్ నే ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు.

ప్ర) ఈ సినిమాకి స్టార్స్ కూడా సపోర్ట్ చేసినట్లు ఉన్నారు.

సన్నీ: అవును వెన్నెల కిషోర్ గారు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. నాని అన్న, అనిల్ రావిపూడి కూడా బాగా హెల్ప్ చేశారు.

ప్ర) ఈ సినిమాకు సెన్సార్ లేట్ అయ్యిందా?

సన్నీ: అబ్బే.. లేదండి.. సెన్సార్ అయిపోయింది. వాళ్ళు కూడా ఈ సినిమా చూసి చాలా నవ్వుకున్నామని చెప్పారు. బాగా ఎంజాయ్ చేశాం అని చెప్పి మమ్మల్ని అభినందించడం మా టీమ్ అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. అలాగే యూఎస్ లో కూడా ప్రీమియర్ వేస్తే వందకు వంద మార్కులు వేశారు.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

సన్నీ: ముందుగా ప్రాజెక్టులు ఒప్పుకుని తప్పు చేయాలనుకోవడం లేదు. ఈ సినిమా ఆడితే నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెడతా. కథలు అయితే వింటున్నాను.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus