మెగాస్టార్ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చిన వి.వి.వినాయక్..!

మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు వి.వి.వినాయక్ ల సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో ఓ మెంబెర్ లా వినాయక్ మసులుకుంటూ ఉంటారు. ఇక వినాయక్ పై చిరుకి కూడా చాలా నమ్మకం ఉంది. ఆయన రీ ఎంట్రీ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యడానికి ఎంతో మంది డైరెక్టర్లు ఆయన్ని అప్రోచ్ అయినప్పటికీ.. మెగాస్టార్ మాత్రం వి.వి.వినాయక్ డైరెక్షన్లోనే రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్‌’ చిత్రాన్ని మెగాస్టార్ తెలుగులో రీమేక్‌ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

మొదట ఈ చిత్రాన్ని ‘సాహో’ ఫేమ్‌ సుజీత్‌ డైరెక్ట్ చేస్తాడని చిరు చెప్పినప్పటికీ.. ఆయన మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడని తెలుస్తుంది.దీంతో చిరు… వినాయక్ కే ఈ చిత్రాన్ని రీమేక్ చేసే బాధ్యతలు అప్పగించారు. అయితే మలయాళం ‘లూసీఫర్’ ‌లో … హీరో మోహన్‌లాల్‌ కు హీరోయిన్‌ ఉండదు. పాటలు , కామెడీ అస్సలే ఉండవు. కానీ మన తెలుగు ఆడియెన్స్ కు అందులోనూ మెగాస్టార్ వీరాభిమానులకు అవి కచ్చితంగా కావాలి.

ఈ విషయం పై వినాయక్ స్పందించి..మెగా ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు. ‘ ‘లూసిఫర్’ రీమేక్లో అన్నయ్య డ్యాన్స్‌లు ఉండవేమో అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఆయన ఇమేజ్‌కి తగ్గట్లుగానే ఆ రీమేక్ ఉంటుంది. అలాంటివి లేకుండా ఒక ఫ్యాన్ గా నేనే ఆయన సినిమాను ఊహించుకోలేను.అలా సినిమా చెయ్యలేను’ అంటూ చెప్పుకొచ్చారు వినాయక్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus