కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. బుల్గానిన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోలోని ‘చిత్తూరికే చందురూడే చిందే వేస్తే..’ అంటూ సాగే మొదటి పాటకి కందికొండ సాహిత్యం అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు. అవినాష్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాటను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ”నిర్మాత రవికిరణ్‌గారు చాలా బిజీగా వుండే డాక్టర్. కేవలం డబ్బు కోసం కాకుండా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తున్న హోమియో డాక్టర్. అలాంటి మంచి మనిషి సినిమాల మీద ప్యాషన్‌తో ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. మళ్లీ ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయి నిర్మాత రవికిరణ్‌గారికి మంచి లాభాలు రావాలి. సప్తగిరి నాకు చాలా ఇష్టమైన కమెడియన్. ఫస్ట్ సాంగ్ చూశాను. చాలా బాగుంది. డాన్సులు ఇరగదీశాడు. హిందీలో ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచి కథ. ఈ సినిమా ఎవరితో తియ్యాలో అర్థం కాక వదిలేసాను. ‘ఠాగూర్’లో ఎంత నిజాయితీగా, ఎంత స్ట్రాంగ్‌గా కంటెంట్ వుంటుందో ఈ చిత్రంలో కూడా అంతే స్ట్రాంగ్ కంటెంట్ వుంటుంది. ఇంత మంచి కథ సప్తగిరికి దొరకడం అతని అదృష్టం. ఈ సినిమా డైరెక్టర్ చరణ్ మద్రాసు నుంచి బాగా పరిచయం. చాలా తెలివైన వాడు. ఎప్పట్నుంచో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. సరైన టైమ్‌లో చరణ్‌కి ఈ సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. డెఫినెట్‌గా ఈ సినిమా చరణ్‌కి మంచి బ్రేక్ అవుతుంది. బుల్గానిన్ మ్యూజిక్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
కామెడీ కింగ్ సప్తగిరి మాట్లాడుతూ ”ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని లాంచ్ చేయడానికి వినాయక్‌గారిని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన. మంచి మనసుతో మా టీమ్‌ని బ్లెస్ చేసి మా చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని లాంచ్ చేయడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.
దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ ”ఎప్పటి నుంచో వినాయక్‌గారితో పరిచయం వుంది. ఆయన్ని ఎప్పుడు కలిసినా నువ్వు ఇంకెన్నాళ్లు కోడైరెక్టర్‌గా చేస్తావు త్వరగా డైరెక్షన్ చెయ్యి అని ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసేవారు. అలాంటి వినాయక్‌గారు మా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. మా నిర్మాత రవికిరణ్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించారు. అలాగే మా హీరో సప్తగిరి ఫస్ట్ నుండి ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు నా థాంక్స్” అన్నారు.
చిత్ర నిర్మాత డా.రవికిరణ్ మాట్లాడుతూ ”మా బేనర్‌లో నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. మంచి మనసున్న వ్యక్తి, చిన్న సినిమా నిర్మాతలు పైకి రావాలని కోరుకునే వినాయక్‌గారు మా చిత్రంలోని మొదటి పాటని ఆవిష్కరించడం మా అదృష్టం. ఇక నుంచి మా బేనర్‌లో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తాయి. ఈ చిత్రంలో సప్తగిరి డాన్సులు అద్భుతంగా చేశాడు. బుల్గానిన్ మంచి సాంగ్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.
సంగీత దర్శకుడు బుల్గానిన్ మాట్లాడుతూ ”వినాయక్‌గారిలాంటి పెద్ద డైరెక్టర్ మా సినిమా తొలి పాటని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది. రవికిరణ్‌గారి బేనర్‌లో ఇది నా సెకండ్ మూవీ. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి మంచి సాంగ్స్ రాబ్టుకున్నారు. పాటలన్నీ ఎక్స్‌లెంట్‌గా వచ్చాయి. విన్నవారంతా సాంగ్స్ చాలా బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. మా హీరో సప్తగిరి, డైరెక్టర్ చరణ్‌గారు నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి మంచి ఆడియో చేయడానికి సహకరించారు” అన్నారు.