Chennakesava Reddy: 21 ఏళ్ల ‘చెన్నకేశవరెడ్డి’ గురించి వినాయక్ చేసిన షాకింగ్ కామెంట్స్!

బాలకృష్ణ చాలా ఫ్యాక్షన్ సినిమాలు చేశారు. అందులో 90 శాతం హిట్లే ఉన్నాయి. ఓ రకంగా ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా బాలయ్యని చెప్పుకోవచ్చు. సీడెడ్ లో బాలయ్య బాబుకి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ఇది కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలతో ఆయన ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ సినిమాలకు ముందు కూడా ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయి.

కానీ ఇండస్ట్రీ హిట్లు కొట్టింది మాత్రం బాలయ్య సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు.! అయితే ‘చెన్నకేశవ రెడ్డి’ అనే ఫ్యాక్షన్ సినిమాలో కూడా బాలయ్య నటించారు. ఇది ఎందుకో అభిమానులు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అని అంతా చెబుతూ ఉంటారు. చెప్పాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ ప్రాజెక్టు. కానీ ఇండస్ట్రీ రికార్డులు కొట్టలేకపోయింది. అందుకు గల కారణాలు కూడా దర్శకుడు వి.వి.వినాయక్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. ” ‘చెన్నకేశవ రెడ్డి’ (Chennakesava Reddy) సినిమా విషయంలో నేను రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారి సపోర్ట్ తీసుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. నిజానికి నేను ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ గారి సపోర్ట్ తీసుకోవాలి. కానీ అప్పట్లో ఆయనతో నాకు పరిచయం లేదు.వెంకటేశ్వరరావు గారు నాకు బాగా క్లోజ్. అందుకే ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాను. కానీ ‘చెన్నకేశవరెడ్డి’ గోపాలకృష్ణ గారి బ్రాండ్ సినిమా. మాస్ సినిమాలకు ఆయన ఇన్పుట్స్ చాలా అవసరం.

ఇక నేను చేసిన ఇంకో తప్పు.. బాలకృష్ణ గారు డబుల్ రోల్ చేస్తున్నప్పుడు నేను టైటిల్ రోల్ పై ఫోకస్ పెట్టాను. పెద్ద బాలయ్యని ఎంత డైనమిక్ గా చూపించాలి అని రాత్రంతా పిచ్చిగా ఆలోచిస్తూ చిన్న బాలకృష్ణ రోల్ ని లైట్ తీసుకున్నాడు. ఇది ఇంకా ఎఫెక్ట్ అయ్యింది” అంటూ వినాయక్ చెప్పుకొచ్చారు. ఈరోజుతో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus