గతంలో రాజమౌళి కంటే కూడా ఓ మెట్టు పైనే ఉండేవారు వినాయక్. ‘సింహాద్రి’ కంటే ముందే ‘ఆది’ తీశారు. ‘ఛత్రపతి’ కంటే ముందే ‘ఠాగూర్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. ఇంకా చెప్పాలంటే.. అప్పట్లో రాజమౌళి సినిమాలకంటే వినాయక్ సినిమాలే జనాలు ఎక్కువగా చూసేవారు. కానీ వినాయక్ కు సరైన స్క్రిప్ట్ లు అందించేవాళ్ళు లేకపోవడం.. ట్రెండ్ కు తగినట్టు ఆయన తీసే సినిమాలు లేకపోవడంతో వెనుకపడిపోయారు.తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా దిల్ రాజు నిర్మాణంలో వినాయక్.. హీరోగా ‘శీనయ్య’ అనే ప్రాజెక్ట్ మొదలైంది.
దాని కోసం వినాయక్ చాలా బరువు కూడా తగ్గారు. ‘శరభ’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన నరసింహారావు ఈ చిత్రానికి దర్శకుడు. కానీ ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దానికి రకరకాల కారణాలు వినిపించాయి.హీరోయిన్ సెట్ అవ్వలేదని ఒకసారి.. బడ్జెట్ ఎక్కువైపోతుందని ఒకసారి కారణాలు వినిపించాయి.తాజాగా ఈ మూవీ గురించి వినాయక్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “నేను సినిమాలు చేయకపోవడానికి కారణాలున్నాయి. నేను ఏదో అనుకోవడం, అది కరెక్ట్‌గా రాకపోవడం… చివరికి మిశ్రమ ఫలితం రావడం జరిగేది.
టైం బాగోలేనప్పుడు ఎవరు ఏం చెప్పినా వినాల్సి వస్తుంది,నమ్మాల్సి వస్తుంది. అలాగే ఏవేవో జరిగిపోయాయి. మధ్యలో దిల్‌రాజు కూడా ‘శీనయ్య’ ప్రాజెక్టుతో రావడం, అది కూడా సరిగ్గా రాకపోవడం…అలా నాకు తెలీకుండానే చాలా టైం వెస్ట్ అయిపోయింది. ఇక నుంచి వేగంగా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను” అంటూ వినాయక్ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!