Vv Vinayak: సినిమా ఆడలేదు కానీ వినాయక్ కు గట్టిగానే అందిందట..!

  • May 26, 2023 / 04:51 PM IST

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ .. హిందీలో కూడా శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేయడం విశేషం.

టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. మే 12న ఈ మూవీ హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకుల నుండి ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘోరంగా నిరాశపరిచింది. ఇదిలా ఉండగా.. దర్శకుడు వినాయక్ ఈ చిత్రానికి గాను ఎంత పారితోషికం అందుకున్నాడు అనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతుంది.

తెలుగులో వినాయక్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నా.. హీరోలు రెడీగా లేరు.ఎందుకంటే వినాయక్ వద్ద స్ట్రాంగ్ రైటర్స్ ఎవ్వరూ లేరు. ఆయన వద్ద బౌండ్ స్క్రిప్ట్ లు లేవు. అందుకే 2018లో వచ్చిన ‘ఇంటిలిజెంట్’ తర్వాత వినాయక్ ఖాళీగానే ఉన్నాడు. ఆ టైంలో హిందీ ‘ఛత్రపతి’ ఆఫర్ వినాయక్ కు వచ్చింది. ఈ చిత్రం కోసం అతను రూ.6 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది.

అంతేకాదు (Vv Vinayak) వినాయక్ పనితనం నచ్చి.. మరో రెండు ప్రాజెక్టులు నిర్మించడానికి ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ముందుకొచ్చిందట. కానీ వినాయక్ అప్పుడు ఓకే చెప్పలేదు. మరి హిందీ ‘ఛత్రపతి’ రిజల్ట్ చూసి..అక్కడి నిర్మాతలు వినాయక్ కు అవకాశాలు ఇస్తారా? అంటే డౌట్ అనే చెప్పాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus