దిల్ రాజు నిర్మాణంలో వి.వి.వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ‘శరభ’ ఫేమ్ నరసింహా రావు ఈ చిత్రానికి దర్శకుడు. లాక్ డౌన్ కు ముందు ఈ చిత్రం ఆగిపోయింది అనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం అయ్యి 25 శాతం షూటింగ్ అవ్వకుండానే ఈ ప్రాజెక్ట్ కు 10 కోట్ల వరకూ బడ్జెట్ అయిపోయిందని … అందుకే నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను ఆపేసారని ప్రచారం జరిగింది.
ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది కాబట్టి వినాయక్ కూడా చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ స్క్రిప్ట్ పనుల్లో బిజి అయిపోయాడు అనే వార్తలు కూడా ఈ మధ్యన మొదలయ్యాయి. అయితే ‘సీనయ్య’ దర్శకుడు నరసింహా రావు మాత్రం… ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటే నాకేమి తెలీదు అన్నట్టు చెప్పుకొస్తున్నాడు.’ ‘సీనయ్య’ కథకు వినాయక్ గారు అయితే సెట్ అవుతారు అని ఆయన్ని అప్రోచ్ అయ్యాము. మొదట ఆయన ఒప్పుకోలేదు… మేము బ్రతిమాలిన తర్వాత ఒప్పుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని నాకు ఇప్పటి వరకూ తెలీదు. నేను స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాను.కరోనా పరిస్ధితి సెట్ అయిన తర్వాత షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు నరసింహా రావు. ఈయన కామెంట్స్ తో కొత్త కన్ఫ్యూజన్ కు తెరలేపినట్టు అయ్యింది.
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!