వివి వినాయ‌క్ త‌న సినీ కాంప్లెక్స్ ని అమ్మకానికి పెట్టారా ?

తొలి చిత్రంతోనే స్టార్ డైరక్టర్ హోదాని సంపాదించుకున్న డైరక్టర్ వి వి వినాయక్. తక్కువకాలంలోనే స్టార్ హీరోలతో విజయాలు అందుకున్న ఇతను కొంతకాలంగా హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. చిరు తో ఖైదీ నంబర్ 150 హైటి కొట్టినా అది తన ఖాతాలో పడకపోయేసరికి అవకాశాలు రావడం లేదు. యువ హీరోలే కాకుండా బాలకృష్ణ సైతం రీసెంట్ గా సినిమా చేస్తానని చెప్పి .. కథ బాగాలేదని పక్కకి తప్పుకున్నాడు. ఇలా ప్రొఫిషనల్ కష్టాలు మాత్రమే కాదు.. ఆర్ధిక కష్టాలు అతన్ని చుట్టిముట్టాయని ఫిలిం నగరవాసులు చెప్పుకుంటున్నారు. అందుకోసమే వైజాగ్‌లో ఉన్న వి-మ్యాక్స్ అనే తన సినీ కాంప్లెక్స్ ను అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది.

ఆ కాంప్లెస్‌లో మొత్తం మూడు స్క్రీన్స్ ర‌న్ అవుతున్నాయి. అయితే తాజాగా వినాయ‌క్ ఆ కాంప్లెక్స్‌ని అమ్మేశాడ‌నే వార్త సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వి-మ్యాక్స్ కాంప్లెక్స్‌ని డిమార్ట్ గ్రూప్స్ వారు దాదాపు 35కోట్ల‌కు కొన్నార‌ని సమాచారం. కాగితాలమీద సంతకాలు కూడా పూర్తి అయిపోయాయని టాక్. దీంతో వ‌చ్చే ఏడాది సంక్రాత్రికి వి-మ్యాక్స్ కాంప్లెక్స్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసి రీ మోడలింగ్ పనులు మొదలు పెట్టనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే వినాయక్ స్పందించాల్సి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus