వినాయక్ థియోటర్స్ కూల్చివేతకు అసలు కారణం..!

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయిక్ గతంలో విశాఖపట్టణంలో ‘వి మాక్స్’ పేరుతో ఓ థియోటర్ కాంప్లెక్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. వైజాగ్ జ‌గ‌దాంబ థియేట‌ర్ల త‌ర్వాత ఆ స్దాయిో పేరు తెచ్చుకుంది ఆ కాంప్లెక్స్ . అందుకు కార‌ణం మన వినాయ‌క్ క్రేజ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ థియోటర్స్ లో ఉన్న ఫెసలిటీలు‌ కూడా అత్యున్నత స్థాయిలో ఉండేవి. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడిగా మంచి ఫామ్లో ఉన్న రోజుల్లో రెండు పాత థియేట‌ర్ల‌ను తీసుకుని ఓ రేంజ్ లో విమాక్స్ గా మర్చి డెవలప్ చేసాడు.

చాలా తక్కువ టైంలోనే ఆ థియేట‌ర్లు చాలా ఫేమస్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ థియేట‌ర్లని కూలగొట్టేయడానికి రంగం సిద్ధమయ్యింది. తాజా సమాచారం ప్రకారం.. వినాయక్ ఓ పెద్ద కార్పోరేట్ సంతకు ఆ కాంప్లెక్స్ ను అమ్మేశాడ‌ట‌. ఆ కాంప్లెక్స్ ను కూల్చేసి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కార్పోరేట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కార్పోరేట్ సంస్థ వినాయ‌క్‌ కు మంచి రేట్ ఆఫర్ చేసిందట. అయితే చాలా మంది వినాయక్ ఆర్దిక ఇబ్బందుల రీత్యా ఆ కాంప్లెక్స్ ను అమ్మేస్తున్నారని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ కామెంట్లలో నిజం లేదని స్పష్టమౌతుంది. ఇక సాయి ధరమ్ తేజ్ తో ‘ఇంటిలిజెంట్’ లాంటి డిజాస్టర్ తర్వాత., ఇంకా ఏ సినిమాను వినాయక్ అనౌన్స్ చేయలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus