ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయక్.. తాను బాలీవుడ్లో తెరకెక్కించబోతున్న ‘ఛత్రపతి’ రీమేక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ కథ గురించి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను కలిశానని.. రాజమౌళిని కూడా కలిసి అతను మార్పులు ఏమైనా కోరితే దాని గురించి కూడా ఆలోచిస్తానని తెలిపాడు. అలాగే రాజమౌళి సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే.. ‘సింహాద్రి’ సినిమాని రీమేక్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.ఆ సినిమాలో పర్ఫెక్ట్ కథ ఉంటుంది అని వినాయక్ తెలిపాడు.
అయితే ఈ కామెంట్ల పై రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనే కాదు సినీ వర్గాల్లో కూడా ‘వినాయక్ కు ఇంకా ‘సింహాద్రి’ రీమేక్ ముచ్చట తెరలేదా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వారు ఈ కామెంట్లు చేయడం వెనుక కూడా కారణాలు ఉన్నాయి. 2006 లో విక్టరీ వెంకటేష్ తో ‘లక్ష్మీ’ అనే సూపర్ హిట్ మూవీని తెరకెక్కించాడు వినాయక్. ఈ చిత్రం కథ దాదాపు ‘సింహాద్రి’ కి దగ్గరగానే ఉంటుంది. ఈ రెండు చిత్రాల్లోనూ హీరో అనాధ. హీరోని చేరదీసి పెద్ద ఇంట్లో ఓ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంటినుండీ వెళ్ళిపోతుంది. ఆమె హీరోకి అత్త వరస అవుతుంది.
అలా వెళ్ళిపోయిన ఆమెను కన్విన్స్ చేసి తిరిగి ఆ ఇంటి పెద్ద ఇంటికి తీసుకురావాలని హీరో ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో తన అత్త కూతురితో ప్రేమలో పడతాడు. విలన్ వలన హీరో అత్త చనిపోతుంది.అనుకోకుండా జరిగిన ప్రమాదంలో హీరోయిన్ పేషెంట్ అవుతుంది. దాదాపు రెండు ఫ్లాష్ బ్యాక్ లు ఒకటే..! వినాయక్ 2006లోనే ‘సింహాద్రి’ ఫార్ములాని వాడాడు. అంతేకాదు ‘నాయక్’ సినిమాలో కూడా కొంచెం ‘సింహాద్రి’ టచ్ ఉంటుంది. అందుకే ‘వినాయక్ కు ఇంకా సింహాద్రి’ ముచ్చట తీరలేదా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.