‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు రికార్డు అంటున్నారు.. నిజమైతే సూపరో సూపర్‌!

సినిమా మూడు వారాలు ఆడితే గొప్ప అనుకుంటున్న రోజులివి. మూడు వారాలు అంటే 21 రోజులు అనుకునేరు. మూడు రోజులు మాత్రమే. అదేం లెక్క అనుకుంటున్నారా? శుక్రవారం, శనివారం, ఆదివారం. ఈ మాట మేం అనలేదు. ఓ ప్రముఖ నటుడు చెప్పిన మాటే ఇది. ఆ విషయం పక్కనపెడితే.. ఇలాంటి ఈ సమయంలో ఓ సినిమా 50 రోజులు ఆడింది అంటే ఆసక్తికరమే. మొన్నీ మధ్య ఇంకో సినిమాకు ఇలాంటి మాటే విన్నాం. ఇప్పుడు అయితే ‘వాల్తేరు వీరయ్య’ గురించి వింటున్నాం.

సంక్రాంతికి విడుదలై రూ. 200 కోట్ల సినిమాగా నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’ మార్చి మొదటివారంలో 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ 50 రోజుల పోస్టర్‌, థియేటర్ల పేర్లు వేసే ఆలోచనలో ఉంది అంటున్నారు. మార్చి 3తో ‘వాల్తేరు వీరయ్య’ అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకోనుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో థియేటర్లు ఈ వేడుకకు సిద్ధమవుతున్నాయని టాక్‌. నైజాం ఏరియాలో దాదాపు 40 సెంటర్లలో ‘వాల్తేరు వీరయ్య’ అర్ధశతకం జరుపుకోనున్నట్లు సమాచారం.

నైజాం ఏరియాలో 15 సెంటర్లలో డైరెక్ట్‌గా 50 రోజులు సినిమా నడవగా, 25 సెంటర్లలో షిఫ్ట్‌తో 50 రోజులు పూర్తి చేసుకుందట సినిమా. ఆంధ్రా ఏరియాలోనూ ఇలానే ఉన్నాయట లెక్కలు. రాయలసీమలో ఫర్వాలేదు అని అంటున్నారు. అలా ఇలా మొత్తంగా 100 సెంటర్లలో ‘వాల్తేరు వీరయ్య’ 50 రోజులు ఆడొచ్చని అంటున్నారు. త్వరలోనే ఆ వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. ఆడిందా? ఆడించారా? అనే ప్రశ్న ఉన్నా.. ఈ రోజుల్లో 50 డేస్‌ లెక్కలా అనేది ఆశ్చర్యకరమే.

పాన్‌ ఇండియా హిట్‌ సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలే ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడలేదు. అలాంటిది ఫక్తు కమర్షియల్‌ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ ఎలా 50 రోజులు ఆడింది అనేదే డౌట్. దీనిపై సినిమా టీమే సమాధానం ఇవ్వాలి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus