Waltair Veerayya: కోర్టుకెక్కిన వాల్తేరు వీరయ్య నటుడు.. ఏమైందంటే?

‘డిస్కో రాజా’ ‘గల్లీ రౌడీ’ చిత్రాలతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన బాబీ సింహా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో ఇతను కనిపిస్తాడు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తో ఇతనికి తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇక కోలీవుడ్లో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న నటుడు బాబీ సింహ తెలుగు వాడే అయినప్పటికీ చెన్నైలోని స్థిరపడ్డాడు.

అక్కడే ఓ ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. తమిళనాడు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉసేన్ అనే వ్యక్తి బాబీ సింహాకి అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో ఉసేన్… జమీర్ అనే బిల్డింగ్ కాంట్రాక్టర్ తో ఇల్లు నిర్మాణానికి కోటి 30 లక్షలతో అగ్రిమెంట్ చేయించడం జరిగింది. కానీ ఇంటి నిర్మాణం అతను పూర్తి చేయలేదు, అంతేకాకుండా ఇంకా ఇవ్వాలని ఉసేన్, జమీర్ కలిసి నటుడు బాబీ సింహా పై ఒత్తిడి చేస్తున్నారట.బాబీ సింహా నిరుత్సాహపడి..

నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కూడా బాబీ సింహకి సాయం చేయడం లేదట. ఉసేన్, జమీర్ ఇద్దరు తమ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బాబీ సింహాని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.దీంతో బాబీ సింహా కోర్టుకెక్కాడు. అయినా జమీర్, ఉసేన్ ఇద్దరూ తగ్గకుండా బాబీ సింహాని చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని కూడా బాబీ సింహా న్యాయస్థానానికి తెలియజేసినట్టు సమాచారం.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus