Waltair Veerayya: దేవిశ్రీ వర్సెస్ థమన్.. ఎవరు పైచేయి సాధిస్తారో?

చిరంజీవి బాబీ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా రవితేజ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటల విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆకట్టుకోలేదు.

దేవిశ్రీ ప్రసాద్ తనపై వస్తున్న విమర్శలకు ఈ సినిమాతో చెక్ పెట్టడంతో పాటు సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ, థమన్ లలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా కొన్నిరోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ఓవర్సీస్ లో కూడా భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి పోటీలో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలయ్య తమ సినిమాల వల్ల బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. ఆదిపురుష్ మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ కానుండగా రిలీజ్ డేట్ విషయంలో గ్యాప్ ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆదిపురుష్ మూవీ కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడం గమనార్హం. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటించిన సంగతి తెలిసిందే. అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా కూడా సంక్రాంతి కానుకగానే రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న సినిమాలకు ఇప్పటికే థియేటర్లను లాక్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus