Waltair Veerayya: రఫ్ఫాడించడానికి వీరయ్య రెడీ.. ఫ్యాన్స్‌ రెడీనా?

వింటేజ్‌ చిరంజీవిని చూపిస్తాను.. సిద్ధంగా ఉండండి అంటూ అప్పుడెప్పుడో మాటిచ్చారు దర్శకుడు బాబి. ఏదో మాట వరసకు అన్నారులే.. నిజంగా చిరును అలా చూపిస్తారా? అని అనుకున్నారంతా. అయితే అనుకున్నట్లుగా అదిరిపోయే అలనాటి చిరంజీవిని అభిమానులకు చూపించారు బాబీ. సినిమా పోస్టర్లు, వీడియోలు, పాటల్లో నాటి చిరంజీవి కనిపిస్తున్నారనే చెప్పాలి. ఈ విషయం పక్కనపెడితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గురించి ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఉత్తరాంధ్రలో చేయాలని టీమ్‌ అనుకుందట.

ఈ మేరకు విశాఖపట్నంలో భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. సినిమా పేరు, నేపథ్యానికి తగ్గట్టు ఈవెంట్ వైజాగ్‌లో అయితే బాగుంటుంది అని టీమ్‌ ఆలోచనట. జనవరి 8న వాల్తేరులో అభిమానుల మధ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో పాల్గొనే అభిమానుల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేస్తారని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాదు సినిమా ట్రైలర్‌ను కాస్త ముందుగా అంటే జనవరి 4నే విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇక సినిమా విషయానికొస్తే సంక్రాంతి సంద్భంగా జనవరి 13న విడుదల చేయబోతున్నారు. థియేటర్ల విషయంలో పంచాయితీ నడుస్తున్నా.. త్వరలో అన్నీ తేల్చుకుంటారని టాక్‌. ఇక ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంతో ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ.. మళ్లీ ఇన్నాళ్లకు ఒకే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు బాబీ సింహా నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమా రవితేజ సరసన కేథరిన్‌ నటిస్తోందట. ఈ సినిమా చిరంజీవి, మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ పనులు మొదలవుతాయి. ఆ తర్వాత ఇంకా ఏ సినిమాను చిరంజీవి అనౌన్స్‌ చేయలేదు. లైన్‌లో అయితే పూరి జగన్నాథ్‌ ఉన్నారు. మరి చిరుకు ఈ సారి పూరి చెప్పే కథ నచ్చుతుందా, నచ్చితే ఎప్పుడు మొదలవుతుంది అనేది చూడాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus