మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’.. ఒకప్పటి వింటేజ్ చిరుని మళ్లీ ఈ సినిమాతో చూడబోతున్నారు ప్రేక్షకులు.. టైటిల్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు కూడా పెరిగాయి.. ఇక ‘బాస్ పార్టీ’ పాట అయితే ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది.. దీనికి రాక్ స్టార్ దేవి శ్రీ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు లిరిక్స్ రాశారు.
నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి డీఎస్పీ కూడా పాడారు. లిరికల్ వీడియోలో చిరు గెటప్, స్టెప్స్ చూస్తే ‘ముఠామేస్త్రి’ లో మెగాస్టార్ గుర్తొస్తారు. తన స్టైల్ ఈజ్, గ్రేస్, ఎనర్జీతో కనిపించారు చిరు. ‘డీజే వీరయ్య’ అంటూ చిరు వాయిస్ వింటుంటే.. థియేటర్లలో ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ హంగామా చేయడం ఖాయం అనిపిస్తుంది. ఇప్పుడు మెగాభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..
జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ గా మెగాస్టార్ మాస్ జాతర ఎలా ఉంటుందో థియేటర్లలో చూడబోతున్నారంటూ వదిలిన చిరంజీవి లుక్ అదిరిపోయింది.. పెద్ద పండక్కి మాస్ మూల విరాట్ హంగామా రేంజ్ ఏంటనేది ఆడియన్స్ ఊహలకే వదిలేశారు టీమ్.. ఈ సంస్థ నిర్మిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ ఒకరోజు ముందుగా జనవరి 12న వస్తుంది.. మాస్ మహారాజా రవితేజ ‘వాల్తేరు వీరయ్య’ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ కలిపి సినిమా మొత్తం దాదాపు 45 నిమిషాల పాటు రవితేజ క్యారెక్టర్ ఉంటుందని,
చిరుతో కలిసి తన మార్క్ కామెడీతో ఇరగదీసేస్తాడని టాక్. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్ పక్కన మాస్ రాజా నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటివరకు చిరు, శృతి, రవితేజ, టెక్నీషియన్స్ తప్ప మిగతా నటీనటులు, ముఖ్యంగా విలన్ ఎవరనేది ఇప్పటివరకు రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతూ వస్తున్న మేకర్స్.. సాంగ్స్, ట్రైలర్ నుండి ఒక్కో ట్విస్ట్, సస్పెన్స్ రివీల్ చేయబోతున్నారు. ‘ఖైదీ నెం.150’ తర్వాత సంక్రాంతికి వస్తున్న చిరు సినిమా ఇదే..
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!