Bigg Boss 7 Telugu: అసలు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఫ్యాన్స్ వార్ ? ఏం జరిగిందంటే…?

బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అనేది చాలా సహజం. కానీ బిగ్ బాస్ హౌస్ బయట అన్నపూర్ణ స్టూడియోస్ సాక్షిగా ఫ్యాన్స్ మద్యలో వార్ జరిగింది. అది కూడా పోలీసు వచ్చి కంట్రోల్ చేసి లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి కల్పించింది. అంతేకాదు, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతు రాయల్ ఆకతాయిలపై కేసు కూడ పెట్టింది. అలాగే, అమర్ దీప్ భార్య తేజస్వి కూడా అందరిపై సీరియస్ అయ్యింది. కేస్ కూడా పెట్టింది. అసలు ఆ గొడవేంటి ? గొడవకి కారణం అంటి అనేది చూసినట్లయితే.,

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే ఫ్యాన్స్ రావడం అనేది చాలా కామన్. చాలాసార్లు ఇలా ఫ్యాన్స్ వచ్చారు. అందరూ కూడా వారిని అభినందించి వీడ్కోలు చెప్తుంటారు. ఇది ప్రతి సీజన్ లో జరిగేదే. అయితే, ఈసారి శృతిమించింది. ఫ్యాన్స్ కొట్టుకునే రేంజ్ కి గొడవ వెళ్లింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్లు, అమర్ దీప్ ఫ్యాన్స్ అని చెప్పుకుని తిరిగేవాళ్లూ గొడవ పడ్డారు. అమర్ గేమ్ విషయంలో, అమర్ ప్రశాంత్ తో చేసిన బిహేవియర్ విషయంలో గొడవ వచ్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేవరకూ ఇరు వర్గాలు వచ్చాయి.

వెంటనే అక్కుడున్న వాళ్ల పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చేలోపే ఒకరిపై ఒకరు పడిపోయి మరీ కొట్టుకున్నారు. అంతేకాదు, అక్కడున్న కార్ అద్దాలు సైతం పగలగొట్టారు. అమర్ దీప్ కార్ ని ధ్వసం చేశారు. బిగ్ బాస్ హోస్ట్ గీతు రాయల్ కార్ అద్దాలు బ్యాక్ సైడ్ మొత్తం పలగకొట్టేశారు. అంతేకాదు, గీతు రాయల్ కార్ తీస్తుంటే కూడా అడ్డుపడ్డారు. లోపల ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఉంటున్నారో తెలియక కార్లని టార్గెట్ చేశారు. అటుగా వస్తున్న యూసఫ్ గూడా ఆర్టీసి బస్ పైన కూడా రాళ్లు విసిరారు. దీంతో బస్సు అద్దాలు పగిపోయాయ్.

బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) బయట అలజడి సృష్టిస్తున్న వీళ్లని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఫోర్స్ సరిపోక పోవడంతో లోకల్ పోలీస్ స్టేషన్ నుంచీ మిగతా వాళ్లని తెప్పించారు. హెల్మెంట్స్ పెట్టుకుని , సేఫ్టీ గార్డ్స్ పెట్టుకుని లాఠీఛార్జ్ చేశారు. ఇలా లాఠీఛార్జ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ లో ఇదే ఫస్ట్ టైమ్. ఇక ఇది చూసిన వాళ్లందరూ కూడా పల్లవి ఫ్రశాంత్ ఫ్యాన్స్ మాత్రమే ఇలా చేశారని క్లియర్ గా చెప్తున్నారు. అదీ మేటర్.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus