పవన్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో గబ్బర్ సింగ్ ఒకటి. ఈ సినిమా అటు పవన్ మరియు అతని ఫ్యాన్స్ కి చాల ప్రత్యేకం. ఎందుకంటే అప్పటి వరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న పవన్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చాడు. దర్శకుడు హరీష్ శంకర్ అద్భుతమైన టేకింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సల్మాన్ ఖాన్ హిట్ మూవీ దబంగ్ కి తెలుగు రిమేక్ గా వచ్చిన ఈ సినిమాను హరీష్ మన నేటివిటీకి దగ్గరగా, పవన్ ఇమేజ్ కి సరిపోయేలా భారీ మార్పులతో స్ట్రైట్ మూవీ అన్నట్లుగా తెరకెక్కించారు. కాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇటీవల 8ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీనితో పవన్ ఫ్యాన్స్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో భారీ హంగామా చేశారు.
కాగా దర్శకుడు హరీష్ ఈ సినిమా విజయాన్ని గుర్తు చేసుకుంటూ తనకు సహకరించిన అనేక మంది సాంకేతిక నిపుణులకు కృతఙ్ఞతలు తెలిపారు. తన రైటింగ్ టీమ్ మెంబర్స్ తో సహా దిగువ స్థాయి వారికి కూడా హరీష్ క్రెడిట్ ఇచ్చారు. మరి సినిమా ఫోర్ ఫిల్లర్స్ లో ఒకరిగా భావించే నిర్మాత పేరును ఆయన అసలు ప్రస్తావించలేదు. ఈ సినిమాకు నిర్మాతగా నటుడు బండ్ల గణేష్ వ్యవహరించారు. శ్రీ పరమేశ్వర క్రియేషన్స్ పతాకంలో ఈ మూవీ నిర్మించారు. మరి హరీష్ అతని పేరు ఎందుకు మరచిపోయాడు అనేది అర్థం కాలేదు.
దీనితో బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా వరుస పోస్ట్లు హరీష్ ని ఉద్దేశించి పెట్టడం మొదలు పెట్టాడు. తనకు నటించడం రాదని, పైకి… లోపల ఒకేలా ఉంటానని పోస్ట్లు పెట్టారు. దీనికి ప్రతిగా హరీష్ ఎవరి కోపం వారినే హరిస్తుంది అన్నట్లుగా ఆయన బండ్ల గణేష్ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా పవన్ భక్తుల మధ్య జరుగుతున్న వార్ ఆసక్తికరంగా ఉంది.