సమ్మర్ సినిమాల్లో మార్పులు ఉండబోతున్నాయా..?

  • February 2, 2021 / 04:39 PM IST

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా రిలీజ్ డేట్స్ ని ఎనౌన్స్ చేసేస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేకుండా ప్రతి సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ పోస్టర్ తో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ – మే నెలల్లో విడుదల కాబోతున్న సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్క్రీన్స్ దొరుకుతాయా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. ముఖ్యంగా చిరంజీవి – వెంకటేష్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆచార్య సినిమాని మే 13వ తేదిన విడుదల చేయబోతున్నారు. అలాగే, మే 14వ తేదిన వెంకటేష్ నారప్ప అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ ఒక్కరోజు గ్యాప్ లో స్క్రీన్స్ వస్తాయా రావా అనేది డౌట్ గానే ఉంది. దీంతో ఎవరు వెనక్కి తగ్గుతారు అనేది ఇంట్రస్టింగ్. మరోవైపు బాలయ్యబాబు, బోయపాటి శ్రీనివాస్ ల సినిమా కూడా మే నెలలోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మే 7వ తేదిని బోయపాటి టీమ్ లాక్ చేస్తే, వెంకటేష్ నారప్ప సినిమాని ముందే రిలీజ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఏప్రిల్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేద్దామనుకున్నా కూడా రానా విరాట్ పర్వం ఏప్రిల్ 30వ తేదిన విడుదల కాబోతోంది. సో, అందుకే ఖచ్చితంగా నారప్ప రిలీజ్ ని వాయిదా వేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఒకవేళ మే 19 లేదా 27 తారీఖులు ఎంపిక చేసుకుందామనుకున్నా కూడా రవితేజ ఖిలాడి సినిమా మే 28న రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు ఎటు చూసినా కూడా సినిమాలు ఏప్రిల్ – మే నెలలని టార్గెట్ చేసుకునే వస్తున్నాయి. అందుకే, నారప్ప వెనక్కి తగ్గుతాడా.. లేదా ముందుకు వెళ్తాడా అనేది చూడాలి. ఇంకా బోయపాటి శ్రీనివాస్ బాలయ్య సినిమా విడుదల తేదిని ఎనౌన్స్ చేయలేదు కాబట్టి, ఇప్పుడు నారప్ప ఆచార్య కంటే ముందే వస్తేనే బెటర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus