టాలీవుడ్‌లో దిల్ రాజు స్థానం వేరు. పంపిణీదారుడిగా జీవితం ప్రారంభించి.. అగ్ర నిర్మాతగా మారిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని, అతని వ్యాపారాన్ని ఉద్దేశిస్తూ ఇటీవల కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు వరంగల్ శ్రీను. ఈయన కూడా నైజాం ఏరియాలో సినిమాల పంపిణీ చేస్తుంటాడు. ఇటీవల ‘క్రాక్’ సినిమా విడుదల సమయంలో దిల్ రాజు – వరంగల్ శ్రీనుకు మధ్య వివాదం వచ్చింది. తన సినిమాకు థియేటర్లు రాకుండా చేస్తున్నారని… దిల్ రాజుపై శ్రీను విమర్శలు చేశాడు. ఆ తర్వాత ఈ వివాదం సమసిపోయేలా కనిపించింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ టాపిక్ చర్చకు వస్తోంది.
వరంగల్ శ్రీను టాపిక్ మరోసారి చర్చల్లోకి రావడానికి కారణం ‘ఆచార్య’. అవును చిరంజీవి ‘ఆచార్య’నే. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను కొనుగోలు చేశాడని టాక్. ఏకంగా ₹40 కోట్లు పెట్టి వరంగల్ శ్రీను ‘ఆచార్య’ నైజాం హక్కులు సొంతం చేసుకున్నాడట. దీంతో దిల్ రాజుకు వరంగల్ శ్రీను ఝలక్ ఇచ్చాడని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా పోటీ పడినప్పటికీ వరంగల్ శ్రీను పెద్ద మొత్తం ముందు పెట్టి ఓకే చేయించుకున్నాడట.
‘ఆచార్య’ నైజాం హక్కులు వరంగల్ శ్రీనుకు దక్కడానికి వెనుక కొరటాల శివ కూడా ఉన్నాడని అంటున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమా సమయంలో దిల్ రాజు – కొరటాలకు మధ్య చిన్న డిస్ట్రబెన్స్ వచ్చిందట. దాని వల్లే ‘ఆచార్య’ వరంగల్ శ్రీనుకు వెళ్లిందంటున్నారు. ఈ లెక్కన వరంగల్ శ్రీను పంతం నెగ్గి పెద్ద సినిమా పట్టేశాడు. అయితే మరిప్పుడు థియేటర్ల విషయంలో ఇబ్బంది పడతాడా? సినిమా సజావుగా విడుదల చేసుకుంటాడా అనేది చూడాలి. మే 13 సమయానికి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!