ఓ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు అంతే చాలు… మీమర్స్ యాక్టివేట్ అయిపోతారు. అదే తమన్ సంగీతమందించిన సినిమాలోని లిరికల్ సాంగ్ బయటకు వచ్చిందంటే చాలు మీమర్స్‌కు పండగే. ఆ బీట్‌లో గతంలోనే ఏదైనా పాట వచ్చిందా అని వెతికేవారు. పనిలోపనిగా తమన్ పాత పాటలు కూడా వినేవారు. ఏదైనా దొరికిందా… ఇక మీమ్స్, మీమ్ వీడియోస్ సిద్ధమే. మాస్ సాంగ్ వచ్చింది మొదలు ‘డప్పుల మోత’ మొదలైంది అంటూ వాయింపు మొదలయ్యేది. అయితే ఇదంతా గతం… ఇప్పుడు పరిస్థితి మారింది. డప్పుల తమన్ కాస్త డార్లింగ్ తమన్ అయ్యాడు.
13 ఏళ్ల క్రితం ‘మళ్ళీ మళ్ళీ’తో తమన్ కెరీర్ మొదలైంది. ఆయన నుండి ఇటీవల వచ్చిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఈ ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే తమన్ ఎంతగా మారాడో అర్థమవుతుంది. తమన్ తొలి హిట్, ఇంకా పెద్ద సినిమా ‘కిక్’. ఆ సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతానికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. మంచి మంచి పాటలు అందిస్తూ, కిక్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వావ్ అనిపించాడు. అదే సమయంలో కాపీ ట్యూన్‌లు అంటూ మాటలు పడ్డాడు. ఎంతగా చెప్పినా విమర్శకులు వినలేదు. ఈ విషయంలో తమన్ చాలాసార్లు బాధపడ్డాడు కూడా. సెంటిమెంట్ పండాల్సిన చోట మాస్ బీట్ ఇచ్చాడని ‘అరవిందసమేత’సినిమాకు విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీలో కొట్టిన రికార్డులు పక్కనపెడితే… తమన్ మ్యూజిక్‌లో చాలామార్పులు తెచ్చింది. ఆ సినిమా తర్వాత మీమర్స్‌కు పెద్దగా పని లేదనే చెప్పాలి. ‘వి’ బ్యాగ్రౌండ్, ‘సోలో బతుకే సో బెటర్’, ‘క్రాక్’, ‘వైల్డ్ డాగ్’ లాంటి సినిమాలు వచ్చినా కాపీ కామెంట్లు పెద్దగా కనిపించలేదు. ‘వకీల్‌సాబ్’ దగ్గరకు వచ్చేసరికి ఇంకా బెటర్ అయ్యాడు. పవన్‌తో సినిమా లైఫ్ టైమ్ గోల్ కాబట్టి చక్కటి సంగీతం ఇచ్చాడని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లో తమన్ కొట్టేవాడే లేడని మరోసారి ‘వకీల్‌సాబ్’ నిరూపించింది. పవన్ ఎలివేషన్ సీన్స్ పండటంలో తమన్ మ్యూజిక్‌కి కీలక పాత్ర అని చెప్పాలి. ఇదంతా చూస్తుంటే ముందుగా చెప్పుకున్నట్లు డప్పుల తమన్.. డార్లింగ్ తమన్ అయ్యాడు.
Most Recommended Video
వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!