Keerthy Suresh: కీర్తి షో… మన దగ్గర చూడరనా.. లేక బాలీవుడ్‌కి మాత్రమే అనా..!

ముంబయి ఫ్లయిట్‌ ఎక్కగానే మన హీరోయిన్లలో ఏదో మార్పు వచ్చేస్తుంది. అప్పటివరకు ఒకలా ఉన్నవాళ్లు.. ఇంకోలా మారిపోతారు. ఇక్కడ స్కిన్‌ షో అనే మాటకు ఆమడ దూరం ఉన్నవాళ్లు అక్కడికెళ్లాక ఈ అందం మీ కోసమే అంటూ అభిమానులకు అందాల గాలం వేస్తుంటారు. అలా అని అందరూ అలా చేస్తారని కాదు కానీ.. రీసెంట్‌గా వెళ్లిన హీరోయిన్లు అలా చేస్తున్నారు అని చెప్పొచ్చు. కావాలంటే మీరే చూడండి.. రష్మిక మందన, మృణాల్‌ ఠాకూర్‌.. ఇప్పుడు కీర్తి సురేశ్‌ (Keerthy Suresh).

Keerthy Suresh

ఇక్కడ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ వచ్చిన వీళ్లు బాలీవుడ్‌కి వెళ్లి (మృణాల్‌ అక్కడి నుండే వచ్చి వెళ్లింది అనుకోండి) అందాల వరద గేట్లు ఓపెన్‌ చేశారు. కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌లో (బేబీ జాన్‌) (Baby John) అనే సినిమా చేస్తోంది. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘తెరి’కి రీమేక్‌గా రూపొందుతున్న సినిమా అది. ఆ సినిమా నుండి ‘నైన్‌ మటక్క..’ అనే పాటను ఇటీవల రిలీజ్‌ చేశారు.

అప్పటివరకు ఆ సినిమా వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan ) సినిమానే అనుకున్న సౌత్‌ ప్రేక్షకులు ఒక్కసారి కీర్తి సురేశ్‌ సినిమా అనడం ప్రారంభిచారు. ఎందుకంటే ఆ పాటలో ఆమె అంతలా ఎఫెక్టివ్‌గా కనిపించింది. ఎఫెక్టివ్‌ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ‘మహానటి’ (Mahanati) సినిమాలో కనిపించిన కీర్తినేనా ఈమె అనేలా కనిపించింది. నిజానికి ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాలో ఓ పాటలో కాస్త అట్రాక్టివ్‌గా కనిపించిన కీర్తి.. ఆ తర్వాత మన దగ్గర ఆ ప్రయత్నం చేయలేదు.

ఇప్పుడు ‘బేబీ జాన్‌’లో చాలా ముందుకు వెళ్లి నటించి, కనిపించి, మెప్పించింది. ఈ సినిమాను డిసెంబరు 25న రిలీజ్‌ చేయబోతున్నారు. అప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది ఆమె గురించి. అన్నట్లు తెలుసుగా ‘తెరి’ అంటే మన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అని. అట్లీ తమిళంలో తీసిన ఈ సినిమాను అతని శిష్యుడు కలిస్‌ ఇప్పుడు బాలీవుడ్లో వరుణ్‌ ధావన్‌తో తీస్తున్నారు. అట్లీ (Atlee Kumar) ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కూడా.

పాన్ ఇండియా ఫైట్ లో కన్నప్ప రిస్క్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus