బిగ్ బాస్ 4: కెప్టెన్సీ రేసులో ‘అభి’ చెప్పిందేంటి..?

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం ఆఖరి బంతి అనే టాస్క్ జరిగింది. ఇందులో ఫైనల్ గా సోహైల్ – అఖిల్ – మెహబూబ్ ముగ్గురు మాత్రమే మిగిలారు. ఈ ముగ్గురిమద్యలోనే అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. సోహైల్ శాక్రిఫైజ్ చేసినా కూడా అఖిల్ అండ్ మెహబూబ్ లు ఇద్దరూ కలిసి పట్టుదలకి పోయి పవర్ ని వదిలేశారు. కెప్టెన్ అయితే నెక్ట్స్ వీక్ ఇమ్యూనిటీ వస్తుందని తెలిసినా కూడా చాలా క్యాజువల్ డిస్కషన్ అనేది పెట్టారు. ఎవరూ కూడా తగ్గలేదు. ఈ విషయంలో మిగతా హౌస్ మేట్స్ కూడా పెద్దగా ఇన్వాల్ అవ్వలేదు. ఈ టాస్క్ లో మనం ఓడిపోయాం అంతే అని పక్కకి వెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.

ఇక సోహైల్ గేమ్ ని శాక్రిఫైజ్ చేసి వచ్చిన తర్వాత సోహైల్ కి అభిజిత్ లాజిక్ విని మైండ్ బ్లాక్ అయ్యింది. నీ గేమ్ నువ్వు నీ ఇష్టం ఉన్నట్లుగా ఆడావ్ కదా.. మరి ఇదే రీజన్ తో నేను నిన్ను వచ్చేవారం నామినేట్ చేస్తే నీకు ఎలా ఉంటుంది అని అడిగాడు. అంతకుముందు కూడా అఖిల్ ని ఇదే పాయింట్ అడిగాడు అభిజిత్. ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు దీనిపైనా కూడా నేను మిమ్మల్ని నామినేట్ చేయచ్చు అన్నాడు. దీనికి వాళ్లిద్దరి దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది.

అంతేకాదు , టీ స్టాండ్ టాస్క్ లో నా నిర్ణయం మీకు నచ్చలేదని నామినేట్ చేశారు. మరి ఇప్పుడు నీ నిర్ణయం నాకు నచ్చలేదని నామినేట్ చేయచ్చా అని అడిగాడు అభిజిత్. సోహైల్ గేమ్ ఆడకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అస్సలు దీన్ని సీరియస్ గా తీస్కోలేదు అని నామినేట్ చేస్తా అన్నాడు. దీనికి సోహైల్ అన్సర్ ఇవ్వకుండా ఏదో చెప్పబోయాడు. కానీ, ఇక్కడ అభిజిత్ అడిగిన లాజిక్ చాలా కరెక్ట్. ఇది విన్న తర్వాతే గేమ్ లో సీరియస్ నెస్ లేదని బిగ్ బాగ్ ఈ టాస్క్ ని రద్దు చేశాడు. అదీ మేటర్.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus