Allu Aravind: చిరంజీవి ఫ్యామిలీతో డిస్ట్రబెన్స్‌.. అల్లు అరవింద్‌ ఏం చెప్పారో?

మెగా కుటుంబం ఫ్యామిలీ ఫంక్షన్‌లో అల్లు అరవింద్‌ కుటుంబం కనిపిస్తుంటుంది. అల్లు కుటుంబం ఫంక్షన్లలో మెగా కుటుంబం కనిపిస్తూ ఉంటుంది. అయినా.. రెండు కుటుంబాల మధ్య ఏదో మనస్పర్థలు ఉన్నాయని, డిస్ట్రబెన్స్‌లు వచ్చాయని గత కొన్నేళ్లుగా వార్తలు, పుకార్లు వస్తూనే ఉన్నాయి. అదేం కాదు, అలాంటిదేం లేదు అంటూ ఎప్పటికప్పుడు ఏదో విధంగా చెబుతున్నా.. ఆ పుకార్ల షికార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై అల్లు అరవింద్‌ మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి బయటికొచ్చింది. అంతేకాదు అందులో అల్లు అరవింద్‌ మాట తీరుతో వైరల్‌గా కూడా మారింది.

అల్లు రామలింగయ్య శతజయంత్యుత్సవాల వేదికపై మొన్నీ మధ్య చిరంజీవి కనిపించారు. అందరి మీద జోకులు వేస్తూ ఎంతో సరదాగా ఉన్నారు. అయినప్పటికీ అల్లు – కొణిదెల కుటుంబాల మధ్య ఏదో ఇబ్బంది అని అంటున్నారు. ఇదే విషయాన్ని ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అల్లు అరవింద్‌ను హోస్ట్‌ అలీ అడిగారు. దానికి అల్లు అరవింద్ ఏమని సమాధానం చెప్పారో తెలియదు కానీ.. దానికి ముందు ఆయన సీరియస్‌ అయినట్లు ఓ ప్రోమో విడుదల చేశారు.

 

ఆ ప్రోమో ఆఖరున అల్లు అరవింద్‌ను అలీ మెగా – అల్లు కుటుంబాల మధ్య అంతా ఓకేనా అనే ప్రశ్న అడిగారు. దీంతో అల్లు అరవింద్‌ వేరుగా స్పందించారు. ‘‘కాంట్రవర్శీ ప్రశ్నలు ఏమన్నా అడుగుతారు అంటే ముందు చెప్పండి అని నేను మీకు ముందే చెప్పాను. అయితే దానిక మీరు కాంట్రవర్శీలు ఏమీ లేవు. కానీ సర్‌ప్రైజ్‌ ప్రశ్నలు ఉన్నాయని చెప్పారు. అయితే సర్‌ప్రైజింగ్‌ ప్రశ్నల్లో ఇదొకటా’’ అంటూ ప్రశ్నించారు అల్లు అరవింద్‌. దీంతో ఏమైందా అని అభిమానులు షాక్‌లో ఉన్నారు.

దీనిపై క్లారిటీ వచ్చే సోమవారం వస్తుంది. అయితే ఆ రోజు అల్లు అరవింద్‌ ఇలానే స్పందించారా? లేక ఎడిట్‌ అలా చేశారా అనేది చూడాలి. ఏదైనా అల్లు అరవింద్‌ ఏం చెప్పారు అనే దాని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus