ఆర్జీవీ తెరకెక్కించిన “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అలియాస్ “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” డిసెంబర్ 12న విడుదలై.. విమర్శకుల నుంచి తక్కువ రేటింగ్స్ మాత్రమే కాక ఛీత్కారాలు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. ఆల్రెడీ తాను పెట్టిన ఖర్చు మొత్తం ప్రీరిలీజ్ బిజినెస్ తోనే సంపాదించిన వర్మ.. కలెక్షన్స్ కారణంగా ఇంకొన్ని లాభాలను వెనకేసుకొంటున్నారు. శనివారం, ఆదివారం “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” టికెట్స్ కూడా చాలా చోట్ల దొరకని పరిస్థితి నెలకొనడం విశేషం.
అయితే.. ఈ సినిమాతో వర్మ కమర్షియల్ గా కంటే పోలిటికల్ గా ఎక్కువ లాభపడ్డాడని తెలుస్తోంది. జగన్ & బ్యాచ్ నుంచి వర్మకు భారీ స్థాయి మద్ధతు లభించిందని తెలుస్తోంది. ఇదే ఊపులో మరో కాంట్రవర్సీ సినిమా తీయాలని వర్మ ప్లాన్ చేస్తున్నాడట. మరి తాను ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాయడం లేదని చాలా బాహాటంగా చెప్పుకొనే.. వర్మ ఇలా ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం.. వాళ్ళని హైలైట్ చేయడం అనేది కడు శోచనీయం.
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!